Posted on 2026-07-21 07:46:47
రాష్ట్ర ఆరోగ్య శాఖ పనితీరును మెచ్చిన కేంద్ర ప్రభుత్వం
మాతా-శిశు ఆరోగ్య సేవల్లో తెలంగాణ మరో జాతీయ విజయాన్ని నమోదు చేసింది
డైలీ భారత్ డెస్క్: మాతా-శిశు ఆరోగ్య సేవల బలోపేతానికి మా ప్రభుత్వం చేపట్టిన చర్యలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి రూ.200 కోట్ల అదనపు ప్రోత్సాహక నిధులను మంజూరు చేయడం ఎంతో సంతోషకరం. ఇది రాష్ట్ర ఆరోగ్య శాఖ సిబ్బంది, వైద్యులు, నర్సులు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది సమిష్టి కృషికి లభించిన గౌరవం. మా ప్రభుత్వ లక్ష్యం ప్రతి గర్భిణికి, ప్రతి తల్లికి, ప్రతి నవజాత శిశువుకు అత్యుత్తమ నాణ్యమైన వైద్య సేవలు అందించడం. ఈ ప్రోత్సాహక నిధులు మాతృ మరణాలు, నవజాత శిశు మరణాలను మరింత తగ్గించడంలో, రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన మాతా-శిశు ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తాయి.తెలంగాణను దేశంలో మాతా-శిశు ఆరోగ్య సేవల్లో అగ్రస్థానంలో నిలబెట్టేందుకు మా ప్రభుత్వం మరింత కట్టుదిట్టంగా పనిచేస్తూ, ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తుంది.
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >