| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

దేశ రాజధానిలో కంపించిన భూమి

దేశ రాజధానిలో కంపించిన భూమి

డైలీ భారత్, న్యూఢిల్లీ: ఈరోజు ఉదయం 6 గంటలకు ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతాన్ని 3.2 తీవ్రతతో భూకంపం వణికించింది. ఫరీదాబాద్‌ను కేంద్రంగా చేసుకుని సంభవించిన ఈ భూకంపం లో ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదు. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ఈ విషయాన్ని ధ్రువీకరించింది.

మంగళవారం ఢిల్లీ-ఎన్‌సిఆర్ అంతటా భూ ప్రకంపనలు సంభవించాయి. ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు ఇప్పటికైతే సమాచారం లేదు. ఉదయం 6 గంటలకు 3.2 తీవ్రతతో భూకంపం నమోదైందని, ఫరీదాబాద్ దాని కేంద్రంగా ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. భూకంపం లోతు అక్షాంశం వద్ద 5 కి.మీ దిగువన, ఉత్తరం వైపు 28.29 డిగ్రీలు, తూర్పు రేఖాంశం వైపు 72.21 డిగ్రీల వద్ద ఉందని వెల్లడించింది. భూకంపానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది

Previous ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ రాజీనామా
Next పోలీస్ స్టేషన్లోనే అధికార పార్టీ నాయకుల మీడియా సమావేశం
ADVERTISEMENT