Posted on 2025-07-17 07:03:43
డైలీ భారత్, పశ్చిమ గోదావరి:ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మోగల్లులో మరో వివాహేతర సంబంధం బయటపడింది. తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందని.. భార్య, ఆమె బంధువులు ఓ ఓ మహిళను స్తంభానికి కట్టేసి చితకబాదిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.
అందుకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధిత మహిళను భీమవరం ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మహిళపై దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
సుబ్బారావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరు మోగల్లు గ్రామంలో నివాసముంటున్నారు. సుబ్బారావు అదే గ్రామానికి చెందిన మరో ఒంటరి మహిళతో ఎఫైర్ పెట్టుకున్నాడు. రెండు నెలల క్రితం పక్క మండలమైన అత్తిలిలో అద్దెకు ఇల్లు తీసుకుని ఆమెతో సహజీవనం సాగిస్తున్నాడు. అక్కడితో ఆగకుండా దుబాయ్‌లో ఉన్న తన కుమారుడు పంపించిన డబ్బులు, ఇతర ఆస్తి పత్రాలు మొత్తం ఆమెకు ఇవ్వడంతో భార్య, భర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి.
దీంతో దంపతులిద్దరూ గత కొంత కాలంగా గొడవలు పడుతూ వచ్చారు. ఈ క్రమంలోనే సుబ్బారావు కుటుంబ సభ్యులు, పెద్దలు అనేకసార్లు అతడి మందలించారు. అయితే సుబ్బారావులో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో విసిగిపోయిన భార్య, కుటుంబ సభ్యులు బుధవారం అత్తిలికి వెళ్లారు. అక్కడ అద్దె ఇంట్లో ఉంటున్న భర్త సుబ్బారావుని, ఒంటరి మహిలను గ్రామానికి తీసుకొచ్చారు.
అనంతరం ఊరిలోని గుడి వద్ద ఉన్న స్తంభానికి ఆ ఒంటరి మహిళను కట్టేసి చితకబాదినట్లు సమాచారం. ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో.. వారు గ్రామానికి చేరుకుని ఆ మహిళను విడిపించి హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం ఈ ఘటనకు పాల్పడిన సుబ్బారావు భార్యతో సహా మరికొందరిని పోలీసులు అరెస్టు చేశారు
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >
సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక
Posted On 2026-09-01 08:21:35
Readmore >