Posted on 2025-07-17 07:29:56
డైలీ భారత్, అంబేద్కర్ కోనసీమ జిల్లా: వారిద్దరి కులాలు, మతాలు వేరు వేరు. అయినా పెద్దలను కాదని ప్రేమించుకున్నారు. అనక ఓ అద్దె ఇల్లు చూసుకుని కలిసి ఉంటున్నారు. కొన్నాళ్లు బాగానే ఉన్నా.. ఆ తర్వాత ఇద్దరి మధ్యా మనస్పర్ధలు రాసాగాయి. ఈ క్రమంలో ప్రియుడి నీచ బుద్ధి బయటపడింది. వ్యభిచారం చేసేందుకు ప్రియురాలిపై ఒత్తిడి తీసుకొచ్చాడు. ఆమె అంగీకరించకపోవడంతో కత్తితో దారుణంగా పొడిచి హత్య చేశాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం బి.సావరం సిద్ధార్థ నగర్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
రాజోలు మండలం బి.సావరం సిద్ధార్థ నగర్‌కు చెందిన షేక్ షమ్మ (22) అనే యువకుడితో ఓలేటి పుష్ప(22) పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో.. గత కొంతకాలంగా బీ .సావరం గ్రామంలో ఇల్లు అద్దెకి తీసుకొని సహజీవనం సాగిస్తున్నారు. అయితే కొంత కాలం సవ్యంగానే ఉన్నప్పటికీ.. క్రమంలో మనస్పర్ధలు రాసాగాయి. ఈ క్రమంలో బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ప్రియురాలు పుష్పను షేక్ షమ్మ వ్యభిచారం చేయడానికి నా వెంట రావలని కోరాడు. ఇందుకు పుష్ప నిరాకరించింది.
దీంతో కోపోధ్రిక్తుడైన షేక్ సమ్మ.. పుష్పను దారుణంగా చాకుతో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటనలో అడ్డు వచ్చిన పుష్ప తల్లి గంగను, సోదరుడునీ కూడా షేక్ షమ్మ గాయపరిచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దీనిపై కేసు నమోదు చేసి నిందితుడు షేక్ షమ్మ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >
సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక
Posted On 2026-09-01 08:21:35
Readmore >