Posted on 2025-07-14 09:29:51
డైలీ భారత్, రేవా జిల్లా: నేరస్తులు తెలివి మీరి పోతున్నారు. నేరాలు చేసి, తప్పించుకోగలం అన్న ధీమాతో అడ్డంగా దొరికిపోతున్నారు. తాజాగా, ఓ భర్త తన భార్యను హత్య చేశాడు. హత్య నుంచి తప్పించుకోవడానికి ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. భార్య శవాన్ని పొలంలో పూడ్చి పెట్టి.. వాటిపై కూరగాయలు నాటాడు. తర్వాత ఊరు విడిచిపారిపోయాడు. 9 నెలల పాటు ఎవ్వరికీ దొరకకుండా తప్పించుకుని తిరిగాడు. చివరకు పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు. ఈ సంఘటన మధ్య ప్రదేశ్‌లోని రేవాలో చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
రేవా జిల్లాలోని సోహగి పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న దేవ్‌ముని మజి, రామ్‌వతి భార్యాభర్తలు. వీరికి ఓ కూతురు, కొడుకు ఉన్నారు. జైల్ రోడ్డులోని పొలంలో దేవ్‌ముని కూరగాయలు పండించేవాడు. ఇందుకు భార్య, కూతురు సాయం చేసేవారు. 2024, అక్టోబర్ 11వ తేదీన దేవ్‌ముని తన భార్యను చంపేశాడు. ఆమె నోట్లో పురుగుల మందు పోసి హత్య చేశాడు. అనంతరం భార్య శవాన్ని పొలంలో పూడ్చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు దానిపై కూరగాయల మొక్కలు నాటాడు.
మధ్యాహ్నం రామ్‌వతి కొడుకు అభిలాష్ మజి పొలం దగ్గరకు వచ్చాడు. అక్కడ తల్లి కనిపించలేదు. తల్లి గురించి తన సోదరిని అడిగాడు. తల్లి ప్రయాగ్‌రాజ్ వెళ్లిందని ఆమె చెప్పింది. సాయంత్రం అయినా తల్లి ఇంటికి రాకపోవటంతో అభిలాష్ మజి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసు కేసు నేపథ్యంలో దేవ్‌ముని కూతుర్ని తీసుకుని ఊరు విడిచిపారిపోయాడు. దేవ్‌ముని తన భార్యను పొలంలో పూడ్చాడని పోలీసులు కనుగొన్నారు. పొలంలోని రామ్‌వతి మృతదేహాన్ని వెలికితీశారు. పరారీలో ఉన్న దేవ్‌ముని కోసం గాలింపు చేపట్టారు. తాజాగా, అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపరిచారు.
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >