| Daily భారత్
Logo




ప్రియుడి కోసం భర్తను చంపేసిన భార్య

News

Posted on 2025-07-14 08:58:28

Share: Share


ప్రియుడి కోసం భర్తను చంపేసిన భార్య

డైలీ భారత్, బీహార్: కొడుకు కళ్ల ముందే భర్తను దారుణంగా నరికి చంపిందో ఇల్లాలు. నోరు తెరిస్తే నీక్కూడా ఇదే గతి పడుతుందని బెదిరించడంతో పన్నెండేళ్ల కుమారుడు భయంతో వణికిపోయాడు. ఈ ఘోరం బిహార్ లోని పూర్ణియా జిల్లాలో చోటుచేసుకుంది. ప్రియుడి కోసమే తాను ఈ పనిచేసినట్లు నిందితురాలు పోలీసులకు వెల్లడించడం అందరినీ విస్తుపోయేలా చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూర్ణియా జిల్లాకు చెందిన బాలో దాస్ (45), ఉషాదేవి దంపతులు తమ ముగ్గురు పిల్లలతో నివాసం ఉంటున్నారు. బాలో దాస్ పంజాబ్ లో కూలిపనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సొంతూరిలోనే ఉన్న ఉషాదేవికి గ్రామంలో మరో యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. అతడిని విడిచి ఉండలేనని భావించిన ఉషాదేవి.. లేచిపోయేందుకు భర్తకు తెలియకుండా ఇంటి స్థలాన్ని అమ్మేసింది.

ఆ డబ్బుతో ప్రియుడితో పరారయ్యేందుకు ప్లాన్ చేసింది. ఇంతలో స్థలం అమ్మిన విషయం తెలుసుకున్న భర్త హుటాహుటిన ఊరికి చేరుకుని భార్యను నిలదీశాడు. కొద్దిరోజులుగా ఇంట్లోనే ఉంటుండటంతో ప్రియుడిని కలిసే వీలు కూడా లేకపోయింది. దాంతో భర్తను అడ్డుతొలగించాలని నిర్ణయించుకుని ఆదివారం రాత్రి గడ్డికోసే కత్తితో భర్త గొంతు కోసింది. పక్కనే పడుకున్న కొడుకు ముఖంపై రక్తం చిందడంతో.. కళ్లు తెరిచి చూసి షాకయ్యాడు. భయంతో కేకలు పెట్టగా.. నోరు మూయకపోతే నిన్ను కూడా నరికేస్తా అని తల్లి బెదిరించడంతో తెల్లవారేంతవరకూ అలాగే ఉన్నాడు. ఉదయాన్నే బంధువులకు విషయం చెప్పగా.. గ్రామస్తులు, బంధువులంతా బాలోదాస్ ఇంటికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు బాలోదాస్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి.. ఉషాదేవిని అరెస్ట్ చేశారు. ప్రియుడితో పారిపోయేందుకే భర్తను చంపినట్లుగా ఉషాదేవి అంగీకరించిందని పోలీసులు తెలిపారు

Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >