| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారం నింపాలి.. పాస్ పోర్ట్ సైజ్ ఫొటో ఇవ్వాలి

ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారం నింపాలి.. పాస్ పోర్ట్ సైజ్ ఫొటో ఇవ్వాలి

బూత్ లెవెల్ అధికారులు తప్పనిసరిగా క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండాలి

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

ఎస్ఐఆర్ పై జిల్లాలోని ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, బూత్ లెవెల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఓటర్ జాబితాలో ఉన్న వారందరూ ఎన్యూమరేషన్ ఫారం తప్పనిసరిగా నింపాలని, ఫారం, ప్రస్తుత పాస్ పోర్ట్ సైజ్ ఫొటో బీఎల్ఓలకు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. ఎస్ఐఆర్ పై జిల్లాలోని ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, బూత్ లెవెల్ అధికారులతో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తో కలిసి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి గురువారం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ అనేది చాలా ప్రత్యేకమని తెలిపారు. బూత్ లెవెల్ అధికారులు తప్పనిసరిగా క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండాలని, ఇంటింటికీ వెళ్లి ఓటర్ జాబితాలో ఉన్న వారందరికీ ఎన్యూమరేషన్ ఫారాలు అందించాలని సూచించారు. ఫారాలు నింపడంలో సహాయం చేయాలని తెలిపారు. ప్రతి ఓటర్ తమ పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు సిద్ధంగా పెట్టుకోవాలని సూచించారు. బీఎల్ఓ లకు ఫారాలు, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు వచ్చేనెల జూలై 24వ తేదీలోగా ఇవ్వాలని సూచించారు. ఈఆర్ఓ, ఏఈఆర్ఓలు, బీఎల్ఓ సూపర్ వైజర్లు క్షేత్ర స్థాయిలోకి వెళ్లి పరిశీలించాలని తెలిపారు. బీఎల్ఓ లు తమకు అందించిన సామగ్రి, ఐడీ కార్డుతో తమ పరిధిలోని ఇండ్లకు బీఎల్ఏలతో కలిసి వెళ్లాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, ఎన్నికల విభాగం అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Previous వరంగల్ : అక్రమ పచ్చడి తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ దాడి
Next ఈ నెల 28 నుంచి 30వ తేది వరకు పల్స్ పోలియో : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
ADVERTISEMENT