Posted on 2025-07-10 17:12:07
10 మందిపై కేసులు నమోదు,సుమారుగా 60,00,000/- రూపాయల విలువ గల వివిధ డాక్యుమెంట్లు స్వాధీనం.
తాకట్టు పెట్టుకున్న పలు వాహనాలు స్వాధీనం
సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవు.
జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపీఎస్.,
డైలీ భారత్, సిరిసిల్ల: జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేకుండా అక్రమ వడ్డీ వ్యాపారం,ఫైనాన్స్ నిర్వహిస్తున్న వారిపై గురువారం రోజున ఉదయం పోలీసులు 20 టీమ్ లగా ఏర్పడి ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా అక్రమ వడ్డీ వ్యాపారం, ఫైనాన్స్ నిర్వహిస్తున్న ఎనమిది మందిని అదుపులోకి తీసుకొని సుమారుగా 60,00,000/- రూపాయల విలువ గల వివిధ డాక్యుమెంట్లతో పాటుగా తాకట్టు పెట్టుకున్న పలు వాహనాలు(04 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో.) స్వాధీనం చేసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లాలో అనుమతులు లేకుండా ఫైనాన్స్ నిర్వహించిన, అధిక వడ్డీలతో సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ హెచ్చరించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..ప్రజల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకొని వడ్డీలకు డబ్బులు ఇచ్చి వారి నుండి అధిక వడ్డీ వసూలు చేసే వ్యాపారులపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ప్రజలు తమకున్న ఉన్న అత్యవసర పరిస్థితి,తాత్కాలిక అవసరాల కోసం అధిక మొతంలో అవసరాలకు మించి అధిక వడ్డీలకు అప్పు చేసి ఆతరువాత అప్పులు,అధిక వడ్డీలు చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడి కుటుంబాలను ఇబ్బందులకు గురిచేయవద్దని ఎస్పీ కోరారు. ప్రభుత్వ అనుమతితో చట్టపరమైన పద్దతులలో ఫైనాన్స్ నిర్వహించే వారిని మాత్రమే నమ్మాలని ఎటువంటి ప్రభుత్వ అనుమతి లేకపోయిన అక్రమ ఫైనాన్సు వ్యాపారం నడిపేవారి వివరాలు జిల్లా పోలీస్ కార్యాలయంలో తనకు సమాచారం ఇవ్వొచ్చు అని,అలాగే స్థానిక పోలీసు వారికి పిర్యాదు చేయాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటు సమగ్ర విచారణ చేసి బాధితులకు న్యాయం చేయడం లక్ష్యంగా పోలీస్ శాఖ పని చేస్తుందని తెలిపారు.
అప్పు తీసుకోవడం,ఇవ్వడం నేరం కాదు కానీ RBI నియమ నిబందనలు,తెలంగాణా మనిలెండింగ్ చట్టంలోని నిబందనల ప్రకారం చట్ట బద్దంగా ఎవరైనా లైసెన్స్ తొ అప్పులు ఇవ్వవచ్చు, తీసుకోవచ్చు కాని చట్ట విరుద్ధంగా, అధిక వడ్డీ రేట్లతో సామాన్యుల పై దౌర్జన్యం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.
కేసులు అయిన వారి వివరాలు...
1.Nalla Pradeep, r/o Gandhi Nagar, sircilla.
2.Dusa Srinivas r/o Nehrunagar,sircilla
3.Dubala Mondaiah r/o Nehrunagar,sircilla
4.Ushakoyila Manohar r/o Nehrungar,sircilla.
5.Anagandula Srihari ,r/oShivanagar,sircilla.
6.Vodnala Anjaneylu, Munnurukapu, r/o Near Nehru Statue, Yellareddypet.
7.Madi Shetty Pursotham s/o Ramachandram,meera R/o Boinpalli,
8.Gorla Ramulu, s/o Narsaiah, Yadav, r/o Thallallapalli , Ellanthakunta.
9.Bondugula Jagadishwar,r/o Mallareddypet near Gandhi Statue, Gambhiraopet.
10.Dandaveni ashok , r/o Gambhiraopet.
బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-15 06:39:17
Readmore >
విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-14 22:44:54
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు
Posted On 2026-01-14 18:45:43
Readmore >