Posted on 2025-07-08 12:11:17
డైలీ భారత్, న్యూస్ నిజామాబాద్: అఖిలభారత పద్మశాలి సంఘం అనుబంధమైన తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం తరఫున నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం నూతన అధ్యక్షుడిగా బిల్లా మహేష్‌ను నియమించారు.
కీర్తి శేషులు పద్మశాలి జాతిపిత కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయాలకు అనుగుణంగా నడుస్తున్న అఖిలభారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగట్ల స్వామి ఆదేశాల మేరకు, అఖిల భారత ప్రధాన కార్యదర్శి జగన్నాథం, రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు కమర్తపు మురళి ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. పద్మశాలి ఐక్యతకు పాటుపడి సంఘాల అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా మురళి సూచించారు. ఈ నియామకాన్ని తెలియజేయడానికి మంగళవారంనగర పద్మశాలి సంఘం కల్యాణ మండపంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
పద్మశాలి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత
ఈ సందర్భంగా, తెలంగాణ రాష్ట్ర ప్రాంత పద్మశాలి సంఘం నియమించిన జిల్లా అధ్యక్ష పదవి నిజమైనదని నమ్ముతూ, జిల్లాలో పద్మశాలి సమస్యలు ఏమైనా ఉంటే వాటిని రాష్ట్ర పద్మశాలి సంఘం ద్వారా ప్రభుత్వానికి వివరించడానికి రాష్ట్ర సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయని నిర్వాహకులు తెలిపారు. అందుకే రాష్ట్ర పద్మశాలి సంఘంతో అనుబంధమైన జిల్లా పద్మశాలి సంఘం సమస్యల పరిష్కారానికి పాటుపడుతూ, పద్మశాలి అభ్యున్నతికి తోడ్పడాలని కోరారు. నిజామాబాద్ పట్టణ నగర పద్మశాలి సంఘం నిజామాబాద్ యువజన సంఘం తరఫున బిల్లా మహేష్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మున్ముందు చేపట్టే కార్యక్రమాలకు కలిసికట్టుగా కృషి చేసి అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ సంఘం ఉపాధ్యక్షులు కన్నా దుబ్బ రాజాం, బాగుల శ్రీనివాస్ , కార్యదర్శులు సుభాష్, బూస రవి, కార్యనిర్వహక కార్యదర్శి కస్తూరి గంగరాజు, ప్రచార కార్యదర్శి బుస శ్రీనివాస్,మరియు యువజన సంఘం నాయకులు సురుకుట్ల భాస్కర్, దోర్నాల రవి,భూమేష్, మురళి, ఎర్రగుంట శ్రీనివాస్ నగర సంగం మాజీ అధ్యక్షులు ఎస్ఆర్ సత్యపాల్, మాజీ కోశాధికారి దోర్నాల రాజు , నాయకులు బొట్టు వెంకటేష్ , పల్నాటి రఘు, శిలివేరి గణేష్, కోడూరు స్వామి తర్ప అధ్యక్షులు గంగుల రవి, కృష్ణ, పొన్నం శంకర్ తదితరులు పాల్గొన్నారు.
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >