| Daily భారత్
Logo




ఓనమాలు నేర్పిన ఉపాధ్యాయురాలు పట్ల ఔదార్యం చూపిన విద్యార్థి

News

Posted on 2025-07-08 10:57:14

Share: Share


ఓనమాలు నేర్పిన ఉపాధ్యాయురాలు పట్ల ఔదార్యం చూపిన విద్యార్థి

ఆమె ఆరు పదులు దాటిన వృద్ధురాలు..

తనకంటూ ఎవరూ లేని స్థితిలో.. గుండె సంబంధిత సమస్యతో  బతికీడుస్తున్న దైన్య స్థితి..

వృద్ధాప్య దశలో ఉన్నవారిని ఐన వారే కాదనుకునే నేటి ఆధునిక కర్కశ సమాజం..

చిన్నప్పుడు ఓనమాలు దిద్దించిన గురువుపట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నాడు జర్నలిస్టు కిరణ్ కుమార్ గండికోట..

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రాంనగర్ నివాసి మొతడాకా రమాదేవి (65) ఓ  ప్రైవేటు పాఠశాల టీచర్ గా పనిచేశారు. తన భర్తను కోల్పోయారు.. పిల్లలు కూడా లేరు.. తనకంటూ ఎవరూ లేని పరిస్థితుల్లో .. వృద్దాప్య దశలో ఓ వైపు ఒంటరితనం వేధిస్తూ ఉంటే మరోవైపు గుండె సంబంధిత సమస్యతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు.

తల్లి తండ్రి తర్వాత స్థానంలో తనకు ఓనమాలు దిద్దించిన గురువు రమాదేవి ఆరోగ్య విషమ పరిస్థితి గురించి తెలుసుకుని చలించి పోయిన కిరణ్ కుమార్.. ఆమెను పరామర్శించి, ఓదార్చి ధైర్యం చెప్పాడు. 

స్థానిక హృదయ క్లినిక్ గుండె స్పెషలిస్ట్ డాక్టర్ వద్దకు ఆమెను తీసుకువెళ్ళి, డాక్టర్ కు పరిస్థితిని వివరించారు.

డాక్టర్ అరుణ్ కుమార్ క్షుణ్ణంగా పరిశీలించి.. గుండెకు సంబంధించిన అన్ని టెస్టులు చేశారు.

ఆమె ఆరోగ్య పరిస్థితి బాగాలేదని, వెంటనే గుండెకు సంబంధించిన ఆపరేషన్ చేయవలసి ఉంటుందని తెలిపారు. 

డాక్టర్ రాసిచ్చిన మందులను నెల రోజులకు సరిపడా  కిరణ్ అందజేశాడు.

 తనవంతు ఆర్థిక సాయంతో పాటు ప్రభుత్వ సహకారంతో ఆపరేషన్ చేయిస్తానని తన టీచర్ కు భరోసా ఇచ్చారు.

చిన్నతనంలో ఓనమాలు దిద్దించిన గురువు పట్ల కిరణ్ కుమార్ చూపిస్తున్న గౌరవం ,ప్రేమ ఆదరాభిమానాలను చూసి డాక్టర్ అరుణ్ కుమార్ సైతం చలించి పోయారు. ఆమె గుండె శస్త్ర చికిత్స కు సంబంధించి  ప్రముఖ కార్డియాలజిస్టులతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు.

ఒక జర్నలిస్టుగా ఆర్థికంగా ఉన్నత స్థితిలో లేకపోయినా కిరణ్ కుమార్ ఆపదలో ఉన్నవారికి తనవంతు సాయం చేయడాన్ని తన ప్రవృత్తిగా చేసుకున్నాడు..

చిన్నతనంలో ఎప్పుడో తనకు ఓనమాలు నేర్పిన ఉపాధ్యాయురాలు పట్ల  కిరణ్ కుమార్ గండికోట చూపిన ఔదార్యం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.

Image 1

భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Posted On 2026-09-03 07:53:15

Readmore >
Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >