Posted on 2025-07-08 12:31:20
మామతో వివాహేతర సంబంధం బయటపెడుతందనే అనుమానంతో కుమార్తెను హత్య చేసిన తల్లి
- దర్యాప్తులో పట్టుబడ్డ తల్లి ఘాతుకం
- జీవిత ఖైదు విధిస్తూ సత్తుపల్లి న్యాయస్థానం తీర్పు
డైలీ భారత్, ఖమ్మం:కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్నతల్లే కుమార్తెను కడతేర్చింది. మామతో వివాహేతర సంబంధాన్ని బయటకు చెప్పేస్తుందనే నెపంతో ఇంతటి దారుణానికి ఒడిగట్టింది. కన్న కుమార్తెను నిర్దాక్షిణ్యంగా హత్య చేసిన ఈ కేసులో తల్లితో పాటు ఆమె మామకూ జీవిత ఖైదు విధిస్తూ ఖమ్మం జిల్లా సత్తుపల్లి న్యాయస్థానంలో జిల్లా ఆరో అదనపు న్యాయమూర్తి ఎం.శ్రీనివాస్ సోమవారం తీర్పు చెప్పారు. 2022లో జరిగిని ఈ ఘటన ఆ సమయంలో ఎన్నో మలుపులతో ఈ కేసు సంచలనం సృష్టించింది.
పోలీసులు, ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం ఖమ్మం జిల్లా బోనకల్లు మండలానికి చెందిన పాలెపు నరసింహారావు(65) కు హరికృష్ణ అనే కుమారుడు ఉన్నాడు. అతనికి సునీత(32) అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి 12 ఏళ్ల కుమార్తె ఉంది. సునీత, తన మామ నరసింహారావుతో వివాహేతర సంబంధం కొనసాగించేది. 2022, ఫిబ్రవరి 8న భర్త హరికృష్ణ ఇంట్లో లేని సమయంలో మామ, సునీత ఏకాంతంగా ఉండటాన్ని ఆమె కుమార్తె చూసింది.
విషయం బయట పడుతుందనే భయంతో సునీత తన మామతో కలిసి కన్న కుమార్తెను హత్య కడతేర్చింది. బాలిక కాళ్లు, చేతులు కట్టేసి వైరుతో గొంతు బిగించి అతిదారుణంగా చంపారు. హత్యను సహజ మరణంగా చిత్రీకరించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. బాలికకు ఫిట్స్ వచ్చి కింద పడిపోయిందని నమ్మబలికి స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. ఖమ్మం తరలించాలని వైద్యులు సూచించటంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు బాలిక చనిపోయిందని నిర్ధారించారు. బాలిక మృతదేహానికి శవ పరీక్ష చేయొద్దని తల్లి, తాత ఒత్తిడి తెచ్చారు.
అయితే పాప మెడపై రాపిడి ఉన్న గుర్తులను చూసిన వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. అప్పటి ఎస్సై కవిత ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆ ప్రకారమే దర్యాప్తు చేపట్టారు. నిందితులు కేసు నుంచి బయట పడేందుకు గ్రామంలోని మరో యువకునిపై నేరం నెట్టే ప్రయత్నాలు చేశారు.
కాగా సదరు యువకుడికి తనతో వివాహేతర సంబంధం ఉందని అతనే తన కుమార్తెను చంపాడని మామ అండతో సునీత పోలీసులకు చెప్పింది. అయితే ఆ యువకుణ్ని పోలీసులు విచారించగా సునీతతో తనుకు వివాహేతర సంబంధం ఉన్నమాట నిజమేనని కానీ హత్యతో తనకు ఏ మాత్రం సంబంధం లేదని తెలిపాడు.
చివరగా సునీతను విచారించగా హత్య విషయం బయటకు వచ్చింది. ఈ కేసు పూర్వాపరాలు, వైద్య నివేదికలు, సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత నిందితులపై మోపిన నేరం రుజువు కావడంతో వారికి జీవిత ఖైదు విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. ప్రాసిక్యూషన్ తరఫున అదనపు ప్రాసిక్యూటర్ మహ్మద్ అబ్దుల్‌పాషా వాదించారు. అదనపు ప్రాసిక్యూటర్‌తో పాటు విచారణ అధికారులు కోర్టు లైజనింగ్ ఆఫీసర్ శ్రీకాంత్, కోర్టు కానిస్టేబుల్ బి.అరవింద్, ఎస్సై కవిత, సీఐ మురళిలను పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ అభినందించారు.
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >