| Daily భారత్
Logo




నాయకపోడు కులస్థులకు ప్రత్యేక సీరియల్ నెంబర్ కేటాయించాలనీ డిమాండ్

News

Posted on 2026-04-20 15:10:20

Share: Share


నాయకపోడు కులస్థులకు ప్రత్యేక సీరియల్ నెంబర్ కేటాయించాలనీ డిమాండ్

తప్పుడు లెక్కల వల్ల ఉద్యోగ,ఉపాధి, అభివృద్ధి అవకాశాలు కోల్పోతున్నాము 

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అంకిత్ కు నాయకపోడు కులస్థులు వినతి పత్రం సమర్పించారు,అనంతరం ​కుల పెద్ద తంబళ్ల రవి మాట్లాడుతూ...ఇటీవల ప్రభుత్వం వివిధ మాధ్యమాల ద్వారా ప్రకటించిన జనాభా వివరాలలో నాయకపోడు తెగ జనాభాను అతి తక్కువగా (కేవలం 16,000 గా) చూపడం జరిగిందని,ఇది వాస్తవానికి పూర్తిగా విరుద్ధంగా ఉందని, భద్రాద్రి కొత్తగూడెం  జిల్లాలోనే మా జనాభా సుమారు 70,000 పైచిలుకుగా ఉందని వారు తెలిపారు,రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6 లక్షల నాయకపోడు జనాభా కలిగి ఉన్నామని,1949లో షెడ్యూల్డ్ తెగల జాబితాలో స్వతంత్రంగా ఉన్న మా తెగను,1950 లో గోండు తెగకు ఉప తెగగా మార్చి సీరియల్ నంబర్ 6 లో చేర్చడం జరిగిందని అన్నారు,దీనివల్ల మా ప్రత్యేక సంస్కృతి,ఉనికి కనుమరుగవుతున్నాయని, ఫలితంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు,విద్యా,ఉద్యోగ అవకాశాలు మా జాతికి సరిగ్గా అందడం లేదని వాపోయారు. ​ప్రస్తుత ప్రభుత్వ సర్వేలోని తప్పులను వెంటనే సవరించి, మా వాస్తవ జనాభా లెక్కలను ప్రకటించాలని, ​రాబోయే కేంద్ర ప్రభుత్వ కుల గణన మరియు జనగణనలో నాయకపోడు తెగకు ప్రత్యేక కాలమ్ (Column) కేటాయించి మా వివరాలను నమోదు చేయాలని,

​షెడ్యూల్డ్ తెగల జాబితాలో మా తెగకు తిరిగి ప్రత్యేక సీరియల్ నంబర్ కేటాయించి మా అస్తిత్వాన్ని కాపాడాలని వారు డిమాండ్ చేశారు,​మా జాతి ఉనికిని,హక్కులను కాపాడటానికి  జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి,ప్రభుత్వ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని మేము విజ్ఞప్తి చేస్తున్నామని కోరారు,ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకపోడు కులస్థులు,యువత, కులపెద్దలు,తదితరులు పాల్గొన్నారు.

Image 1

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి

Posted On 2026-09-09 08:35:55

Readmore >
Image 1

తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే

Posted On 2026-09-09 08:34:54

Readmore >
Image 1

నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం

Posted On 2026-09-08 18:02:08

Readmore >
Image 1

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణమాసం కుంకుమ పూజలు

Posted On 2026-09-08 18:01:01

Readmore >
Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >