Posted on 2025-07-08 06:29:03
డైలీ భారత్, తమిళనాడు: తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కడలూరు జిల్లా చెమ్మంగుప్పంలో ప్రైవేట్ స్కూల్ వ్యాన్‌ను రైలు ఢీకొట్టింది. రైలు వెళ్లే సమయానికి గేటు వేయకపోవడంతో ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రాథమిక నివేదికల ప్రకారం 10 మందికి పైగా విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో స్కూల్ వ్యాన్ నుజ్జునుజ్జు అయినట్లు కనిపిస్తోంది.
వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఘటనపై అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటినా రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి సహాయక చర్యలు చేపట్టారు. కాగా, ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. రైల్వే గేట్ కీపర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >