Posted on 2025-07-04 18:15:07
కలెక్టర్ ఫెన్సింగ్ ఏపిస్తే వీరు తీసి విక్రయాలు జరిపారు
59 జీవోతో సొంత వారికే పట్టం కట్టిన వైనం?
తాసిల్దార్ పనితనంపై పలు ప్రదేశాలలో విమర్శలు
సర్కార్ స్థలాలు అంటే సారు వారికి చులకనైనా!
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రెవెన్యూ సంబంధించిన ఆస్తులను కాపాడవలసిన మండల తాసిల్దార్లు అచ్యుత్వాహం ప్రదర్శించి ప్రభుత్వ భూములను కనుమరుగయ్యే స్థితికి తీసుకురావటం నియోజకవర్గం లోను సంచలనం సృష్టిస్తుంది. కొందరు అధికారులు విధి నిర్వహణలో భాగంగా ఎక్కడ విధులు నిర్వహిస్తే అట్టి ప్రదేశంలో ఉన్న ప్రభుత్వం భూములపై పెత్తనం చెలాయించి ప్రభుత్వం భూములను విక్రయాలు జరిపించే సందర్భాలు సంతరించుకుంటున్నాయి. జిల్లా కలెక్టర్లు సైతం ఫెన్సింగ్ వంటి రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తే తాసిల్దార్లు అట్టి ఫెన్సింగ్ ను తొలగించి దర్జాగా విక్రయాలు జరిపించుకున్నారన్న ప్రచారం సైతం నేటికీ అట్టి ప్రాంతాల్లో జోరుగా ప్రచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొందరి అధికారులు పాల్వంచ పరిధిలోని ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతర్లు కు 58. 59, జీవోతో ప్రభుత్వం భూమిని సైతం రెగ్యులేషన్స్ జరిపించి యదేచ్చగా రిజిస్ట్రేషన్ కొనసాగించి సొంత వారికి కట్టబెట్టిన సంఘటనలు లేకపోలేదు. ఇటువంటి తాసిల్దారు పనితనంపై ఆయా ప్రాంతంలో భారీ స్థాయిలో నేటికీ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. సారువారికి సర్కారు భూములు అంటే చులకన ఎక్కువే అన్నట్లుగా ఉండటంతో ముడుపులు గట్టిగానే మూడుతున్నట్లు ప్రచారం సైతం భారీగానే కొనసాగినట్లు విశ్వసినీయ సమాచారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని ఓ రెవెన్యూ కార్యాలయంలోని గిరిదావర్ కి బాస్ అయినవారు ఇటువంటి ఘనకారాలు చేశారంటే ఇప్పటికీ ఆయా ప్రాంతంలో వారి పేరు మారుపోవుతుందని ప్రచారం సైతం భారీగా కొనసాగుతుంది.
గత కొంత కాలంలో పాల్వంచ, శ్రీనివాస కాలనీ భారీ కుంభకోణమేనా?
నియోజకవర్గంలోని దమ్మపేట మండలంలో పనిచేస్తున్న సర్కార్ అధికారి గత కొంతకాలం క్రితం పాల్వంచ, శ్రీనివాసపురంలోని తాసిల్దార్ గా విధులు నిర్వహించినట్లు విశ్వసనీయ సమాచారం అట్టు సందర్భంలో అప్పటి జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహించిన రంజిత్ కుమార్ సమయంలో ఓ అధికారి అయిన స్వామి 444 సర్వే నెంబర్ భూమిలో కొంత భూమికి (ఫెన్సింగ్) రక్షణ కవచం ఏర్పాటు చేసినట్లు విశ్వసనీయ సమాచారం తదుపరి నవీన్ కుమార్ శర్మ అనే డిప్యూటీ తాసిల్దార్ అట్ట భూమిని కాపాడుతున్న సమయంలో దొరగారు తాసిల్దార్ బాధితులు రావటంతో పాల్వంచలో అడుగుపెట్టడం 444 సర్వే నెంబర్ లో అందరు అధికారులు కాపాడుతున్న భూమిని యదేచ్చగా విక్రయాలు జరిపి భారీ స్థాయిలో కాసులను కూడబెట్టుకున్నట్లు నేటికీ ఆ ప్రాంతంలో భారీ స్థాయిలో ప్రచారాలు కొనసాగుతూనే ఉన్నాయి.
59 జీవోతో రెగ్యులేషన్స్ చేసి సొంత వారికే కట్టబెట్టిన ఘనత వారికే సొంతం
ప్రభుత్వం భూములపై బాధ్యత కలిగిన అధికారి 59 జీవోతో 444 సర్వే నెంబర్ లో సుమారు సొంతవారికి 500 గజాల భూమిని కొత్తగూడెం సబ్ రిజిస్టార్ కార్యాలయంలో క్రమబద్ధీకరణ జరిపించి సొంత బంధువులకు కట్టబెట్టిన ఘనత వారికే సొంతం అన్నట్లుగా నేటికీ పలు ప్రభుత్వ కార్యాలయాల్లో భారీ స్థాయిలో ప్రచారాలు కొనసాగుతున్నాయి ప్రభుత్వం భూములపై బాధ్యత కలిగిన తాసిల్దార్ లే ఇటువంటి కబ్జాలకు పాల్పడితే సామాన్య ప్రజలు పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించే స్థాయికి ఉందని దొరవారి పనితనం అంత డొల్లే అన్నట్లుగా సారు వారు నడుచుకుంటున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు స్పందించి 2022- 23 సంవత్సరం నందు దొరవారు పనిచేసిన ప్రదేశాలలో భారీ అక్రమాలపై విచారణ చేపట్టాలని అలాగే పాల్వంచ పట్టణంలోని శ్రీనివాస్ కాలనీ సమీపంలో 444 సర్వే నెంబర్ వై విచారణ కొనసాగిస్తే భారీ అక్రమాలు బయటపడే అవకాశం ఉంటుందని పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు
బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-15 06:39:17
Readmore >
విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-14 22:44:54
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు
Posted On 2026-01-14 18:45:43
Readmore >