| Daily భారత్
Logo




వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్టు రిమాండ్

News

Posted on 2025-06-30 19:07:12

Share: Share


వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్టు రిమాండ్

పలు జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్టు రిమాండ్ కు తరలింపు 

12 తులాల బంగారం, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం.

పలు జిల్లాలో 16 కేసులలో నింధితునిగా ఉన్న బోదాసు మహేష్.

వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపీఎస్.,

డైలీ భారత్, వేములవాడ:  జగిత్యాల జిల్లాకు చెందిన బోదాసు మహేష్ అనే వ్యక్తి నిజామాబాద్ జిల్లాకి చెందిన గద్దల స్వప్న,విశాల్ సింగ్ జగిత్యాల జిల్లాకు చెందిన నేరెళ్ల శ్రీనివాస్,నేరెళ్ల రాణి గోత్రాల బాలమణి అను వారితో ఒక ముఠాగా ఏర్పడి రాత్రి వేళల్లో తాళం వేసిన ఇండ్లు లక్ష్యంగా ఆర్ముర్,నిజామాబాద్,వేములవాడ,కొనరావుపేట,బోయినపల్లి ప్రాంతల్లో దొంగతనం చేయడానికి సరైన సమయం కోసం చూస్తుండగా తేదీ 02-05-2025 రోజున రాత్రి సమయంలో వేములవాడ పట్టణం సాయి నగర్ ప్రాతంలో దొంగతనానికి పాల్పడగా, 23-05-2025 రోజున మరల సాయి నగర్ ప్రాతంలో,12-06-2025 రోజున వేములవాడ పట్టణం భగవంతరావు నగర్ ప్రాంతంలో,తేది.11.05.2025  రోజున రాత్రి సమయంలో ఆర్మూర్ పట్టణంలోని అరుంధతినగర్ ప్రాంతంలో,తేది.16.05.2025 రోజున రాత్రి సమయoలో ఆర్మూర్ పక్కన గల పెరకిట్ వినాయకనగర్ ప్రాంతంలో , అదేవిదంగా తేది.25.05.2025 రోజున అర్ద రాత్రి సమయoలో ఆర్మూర్ పక్కన గల  పెరకిట్ వినాయకనగర్ ఏరియాలో ప్రాంతంలో ఇక ఇంట్లో, తేది.02.06.2025 రోజున వేకువ జామున ఆర్మూర్ పట్టణంలోని మెడ్ ప్లస్ మెడికల్ షాప్ లో,అదేవిదంగా తేది. 07.06.2025 రోజున వేకువ జామున ఆర్మూర్ పట్టణంలోని యోగేశ్వర కాలనీలో,ఆదేవిదంగా తేది.16.06.2025 రోజున వేకువ జామున ఆర్మూర్ పక్కన గల పెరకిట్  RTC కాలనీలో భోదాసు మహేష్ అనే నిందుతుని ఆధ్వర్యంలో దొంగతనాలకు పాల్పడుతూ దొంగిలించిన సొమ్ముతో జల్సాలకు పాల్పడుతున్న మహేష్ తో సహా ఐదుగురు నిందితులను సాంకేతికత ఆధారంగా ఈ రోజు ఉదయం తిప్పపూర్ బస్టాండ్ ప్రాతంలో అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 12 తులాల బంగారం,ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకోని ఈ రోజు రిమాండ్ కి తరలించడం జరుగుతుందన్నారు.

నిందుతుల వివరాలు.

1.బోదాసు మహేష్, s/o కొత్తయ్య,  age 30 సం.లు, వెల్లుళ్ల  గ్రామం,మెట్ పల్లి మండలం,జగిత్యాల జిల్లా.

2.గద్దల స్వప్న  w/o సంజీవ్, r/o మంచిప్ప గ్రామం, మోపాల్ మండలం, నిజామాబాద్ జిల్లా.

3.గోత్రాల బాలామణి w/o నర్సయ్య, r/o మంచిప్ప గ్రామం,మోపాల్ మండలం,నిజామాబాద్ జిల్లా.

4.ఠాకూర్ విశాల్ సింగ్  s/o రామ్ చరణ్ సింగ్,  r/o కుమార్ నగర్, నిజామాబాద్.

5.నేరెళ్ళ శ్రీనివాస్, s/o  రాజం, r/o చల్ గల్ గ్రామం, జగిత్యాల రూరల్ మండలం, జగిత్యాల జిల్లా.

6.నేరెళ్ళ రాణి  w/o నేరెళ్ళ శ్రీనివాస్, r/o చల్ గల్  గ్రామం, జగిత్యాల రూరల్ మండలం,జగిత్యాల జిల్లా

వరుస దొంగతనాలు చెక్ పెట్టి నింధితులను పట్టుకోవడంలో కృషి చేసిన వేములవాడ పట్టణ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్, ఎస్.ఐ లు అనిల్ కుమార్, వెంకట్రాజం, సిబ్బంది గోపాల్, పంతులు, లత, సాహెబ్ హుస్సేన్, దేవేందర్, సంయుద్దీన్ లను జిల్లా ఎస్పీ  ప్రత్యేకంగా  అభినందించారు.

Image 1

రాజన్న సిరిసిల్ల : పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు

Posted On 2026-06-06 22:16:35

Readmore >
Image 1

మ‌రో రెండు వారాలు హైడ్రా ప్ర‌జావాణికి విరామం

Posted On 2026-06-06 20:55:30

Readmore >
Image 1

సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్

Posted On 2026-06-06 20:53:26

Readmore >
Image 1

మహిళల భద్రత – సమాజ ప్రగతికి బలమైన పునాది

Posted On 2026-06-06 18:47:24

Readmore >
Image 1

14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ

Posted On 2026-06-06 16:51:52

Readmore >
Image 1

వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు

Posted On 2026-06-06 16:51:06

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి

Posted On 2026-06-06 16:50:07

Readmore >
Image 1

వేధింపులను మౌనంగా భరించకండి.. ఎదురించండి.

Posted On 2026-06-06 10:44:23

Readmore >
Image 1

గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్

Posted On 2026-06-06 08:15:43

Readmore >
Image 1

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-05 21:46:24

Readmore >