| Daily భారత్
Logo




నకిలీ జీతాల బిల్లులు తయారు చేసి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టిన ప్రభుత్వ ఉద్యోగికి జైలుశిక్ష

News

Posted on 2025-06-30 15:39:07

Share: Share


నకిలీ  జీతాల బిల్లులు తయారు చేసి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టిన ప్రభుత్వ ఉద్యోగికి జైలుశిక్ష

నకిలీ  జీతాల బిల్లులు తయారు చేసి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టిన ప్రభుత్వ ఉద్యోగికి 03 సం.జైలుశిక్షతోపాటు 10,000/- రు. జరిమానా

నకిలీ జీతాల బిల్లులు తయారు చేసి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టిన ప్రభుత్వ ఉద్యోగికి మూడు సంవత్సరాల కఠిన కారాగార జైలు శిక్షతో పాటు పదివేల రూపాయల జరిమానా జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రథమ శ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్  సోమవారం తీర్పు వెల్లడించినట్లు సిరిసిల్ల సిఐ కృష్ణ తెలిపారు

డైలీ భారత్, గంభీరావుపేట: గంభీరావుపేటమండల కేంద్రంలో గల ప్రైమరీ హెల్త్ సెంటర్లో బానోతు నరేష్ అనే వ్యక్తి సీనియర్ అకౌంటెంట్గా పని చేయుచున్నాడు. అతను మోసపూరితంగా ప్రభుత్వ ఖజానా నుండి డబ్బులు కాజేయాలన్న దురుద్దేశంతో  2015 జనవరి మాసం నుండి 2015 నవంబర్ మాసం వరకు స్టాప్ నర్స్ మంజులత పేరున మరియు 2015 మార్చి నుండి 2015 నవంబర్ నెల అరుణ అను స్టాప్ నర్స్ పేరున వారి యొక్క నెలవారి జీతాలు బిల్లులు మరియు లీవ్ సాలరీ బిల్లులు తయారు చేసి సబ్ ట్రెజరీ కార్యాలయం సిరిసిల్లలో దాఖలు చేసి అప్పటివరకు మొత్తం 12 లక్షల రూపాయలు విడ్రా చేసి జీతం మినహాయింపు రూపాయలు 1,06,194 ఫోను మిగతా 11 లక్షల 5514 తన ఎస్బిహెచ్ బ్యాంకు నందు జమ చేసుకొని తన సొంతనికి వాడుకున్నాడు.

కరీంనగర్ జిల్లా ట్రెజరీ ఉపసంచాలకుల విచారణలో సదరు స్టాఫ్ నర్సులు మంజులత, అరుణ అనువారు గంభీరావుపేట మండల కేంద్రంలో గల ప్రైమరీ హెల్త్ సెంటర్లో పని చేస్తాలేరని వారు వేరేచోట పని చేస్తూ వారి వారి జీతాలు బిల్లులు సంబంధిత ట్రెజరీ ద్వారా డ్రా చేసుకున్నట్లు సమాచారం కలదు.ఆయా ఉద్యోగుల జీతాలు జిపిఎఫ్ మినహాయింపులు రెండింతలు రావడం అకౌంటెంట్ జనరల్ డిపార్ట్మెంట్ వారు గమనించి మా అధికారులతో చెప్పిన క్రమంలో మాతదుపరి విచారణలో బానోత్ నరేష్ పాల్పడిన మోసం వెలుగులోకి వచ్చినది సదరు నరేష్ శాఖ వారికి ఎటువంటి అనుమానం రాకుండా తన డ్రాయింగ్ అండ్ డిశ్చార్జ్మెంట్ అధికారి డాక్టర్ రమేష్ గారి సంతకాలతో కూడిన బిల్లులను మాశాఖ వారి ట్రెజరీ బిల్ రిజిస్టర్ ద్వారా ఇవ్వగా అతడు పెట్టిన బిల్లులు శాఖ వారు మంజూరు చేయగా దానికి సిరిసిల్ల సబ్ ట్రేసర్ సిబ్బంది అనగా సంబంధిత బిల్లులు మంజూరు చేసిన సీనియర్ అకౌంటెంట్ లో గానీ ఎస్టిఓ గానీ వారు చేస్తున్న మోసంను గుర్తించలేక బిల్లులు మంజూరు చేసినారు.ఈ విషయం జిల్లా కలెక్టర్ గారికి తెలియపరచగా వారు పై తదుపరి ఉత్తర్వుల తరువుల ప్రకారం బాద్ధులైన రెండు శాఖల సిబ్బందిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిందని కోరగా,కందగట్ల శ్రీనివాస్ డిటిఓ కరీంనగర్ సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అప్పటి సీఐ విజయకుమార్ కేసు నమోదు చేసి నిందితుడైన బానోతు నరేష్ పై కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసినారు. కోర్టు మానిటరింగ్ ఆర్.ఎస్.ఐ.శ్రావణ్ ఆధ్వర్యంలో కోర్ట్ కానిస్టేబుల్ వేముల నరేష్ కోర్టులో 6 మంది సాక్షలను  ప్రవేశపెట్టగా ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెలుమల్ల సందీప్ వాదించారు కేసు  పూర్వపరాలు పరిశీలించిన సిరిసిల్ల ప్రథమ శ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్  నేరం రుజువు కావడంలో నిందితుడైన బానోతు నరేష్ కు మూడు సంవత్సరాల కఠిన కారాగారా జైలు శిక్షతో పాటు (10000)పదివేల రూపాయల జరిమానా విధించినట్లు సిరిసిల్ల సీఐ. కృష్ణ  తెలిపారు.

Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా

Posted On 2026-09-03 09:21:29

Readmore >
Image 1

భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Posted On 2026-09-03 07:53:15

Readmore >
Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >