డైలీ భారత్, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో బుధవారం రాత్రి కరెంట్ షాక్ తో జూనియర్ లైన్ మెన్ ప్రవీణ్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన స్వస్థలం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం మోదుకుంట. కాగా ప్రవీణ్ అనాథ అయిన సౌమ్యను ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొత్తగూడ గాంధీ నగర్ లో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం ఆమె 9 నెలల గర్భిణి గురువారం ఉదయం ఆమేకు విషయం తెలిపారు. దీంతో ఆమె తనకు దిక్కెవ్వరు అంటూ కన్నీరుమున్నీరుగా విలపించడం కలచివేసింది.
News
మహబూబాబాద్ జిల్లాల్లో విషాదం...! భార్య 9 నెలల గర్భిణి.. భర్త విద్యుత్ షాక్ తో మృతి