| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మాధకద్రవ్యాల నిర్మూలన నేటి తరం విద్యార్థుల చేతిలోనే ఉంది : ఎస్పీ . డి. వి. శ్రీనివాస రావు

మాధకద్రవ్యాల నిర్మూలన నేటి తరం విద్యార్థుల చేతిలోనే ఉంది : ఎస్పీ . డి. వి. శ్రీనివాస రావు

పిల్లల పెంపకం తల్లిదండ్రుల బాధ్యత

డ్రగ్స్ కు బానిసలకు కాకుండా ఉపాధ్యాయులు శ్రద్ధ తీసుకోవాలి

డైలీ భారత్, న్యూస్ మెదక్:అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ . రాహుల్ రాజ్, జిల్లా ఎస్పీ. డి. వి. శ్రీనివాస రావు ఆధ్వర్యంలో  మెదక్ పట్టణంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నుండి రాందాస్ చౌరస్తా వరకు  సే నో టు డ్రగ్స్, సేవ్ టు లైఫ్, మత్తు పదార్థాలను సేవించడం ఆరోగ్యానికి హానికరం, అని నినాదాలు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించడం జరిగింది.

ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ . డి. వి. శ్రీనివాస రావు మాట్లాడుతూ

డ్రగ్స్ మత్తులో యువత నేరలకు పాలపుడు తున్నారని అన్నారు. డ్రగ్స్ కు బానిసలైన వారిని రిహాబిలిటేషన్ సెంటర్ కు తరలిస్తాం. మాదక ద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించే లక్ష్యంలో ప్రజలు భాగస్వామ్యం కావాలి.

ప్రతి ఒక్కరు మాధకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, భవిష్యత్తు రోజుల్లో మాధకద్రవ్యాల నిర్మూలన నేటి తరం విద్యార్థుల చేతిలోనే ఉంది అని అన్నారు. విద్యార్థుల దృష్టి తమ భవిష్యత్తు జీవిత లక్ష్యం పై మాత్రమే ఉండాలని, నిషేధిత గంజాయి డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాల వాడకం పట్ల విద్యార్థులు ఆకర్షితులు కావద్దని ఎస్పీ  సూచించారు. 


గంజాయి డ్రగ్స్ అలవాటు వలన శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని పాడుచేస్తుందని కావున చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.

యువత పురోగతికి, భావి జీవితానికి అవరోధంగా నిలుస్తూన్న మాధకద్రవ్యాలను సమాజం నుండి సమూలంగా నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని విజ్ఞప్తి చేశారు. జిలాల్లో గంజాయి, డ్రగ్స్ నిర్ములనకు జిల్లాలోని కళాశాలలో, పాఠశాలలో విద్యార్థినీ, విద్యార్థులకు  కళ బృందం అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.

మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం  ఎవరికైనా తెలిస్తే డయల్ 100,1908, పోలీస్ వారికి అందించాలని సూచించారు.

Previous యాంటీ డ్రగ్ డేలో భాగంగా విద్యార్థులతో కలిసి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ
Next మహబూబాబాద్ జిల్లాల్లో విషాదం...! భార్య 9 నెలల గర్భిణి.. భర్త విద్యుత్ షాక్ తో మృతి
ADVERTISEMENT