Posted on 2025-06-23 08:45:43
డ్రగ్స్ నిర్ములనకోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి.
ప్రతి విద్యార్థి,యువత యాంటీ డ్రగ్ సోల్జర్ మారాలి.
మాదకద్రవ్యాల దుర్వినియోగం - అక్రమ రవాణా అవగహన వారోత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రంలో 2k రన్.
జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాధకద్రవ్యాల నిర్మూలనపై నిర్వహించిన 2K రన్ కు భారీ స్పందన
ఉత్సాహంగా పాల్గొన్న చిన్న,పెద్ద,యువతి,యువకులు, విద్యార్థిని విద్యార్థులు,పోలీస్ అధికారులు,సిబ్బంది.
మాదకద్రవ్యాల దుర్వినియోగం-అక్రమ రవాణా అవగహన వారోత్సవాల సందర్భంగా డ్రగ్-రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న క్రమంలో మత్తు పదార్థాలను అరికట్టేందుకు ప్రజలు,యువత/విద్యార్థులతో కలసి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి బతుకమ్మ ఘాట్ వరకు నిర్వహించిన 2k రన్.
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: డ్రగ్స్ నిర్ములనకోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యమై డ్రగ్స్ మహమ్మరిని నిర్ములించి భావితరాలకు మంచి భవిష్యత్తు అందిద్దామని ఎస్పీ పిలుపునిచ్చారు.
యువత గంజాయి లాంటి మత్తుపదార్థాలకు బానిసలై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని,చెడు అలవాట్లకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తు వైపు నడుచుకోవాలని తెలిపారు.ప్రతి విద్యార్థి,యువత యాంటీ డ్రగ్ సోల్జర్ గా మారి మాధకద్రవ్యాల వలన కలుగు అనర్ధాలపై అవగాహన కల్పించాలన్నారు. సమాజంలో మాదక ద్రవ్యాలు సమూలంగా నిర్మూలించటలో యువత,ప్రజలు పోలీసువారికి సహకరించుటలో కీలక పాత్ర పోషించాలని కోరారు.
మాదకద్రవ్యాల దుర్వినియోగం-అక్రమ రవాణా అవగహన వారోత్సవాలలో భాగంగా జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో మాధకద్రవ్యాల వలన కలుగు అనర్ధాలపై పెద్దఎత్తున కార్యక్రమాలు చేపట్టి విద్యార్థులకు,యువతకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
IM ANTI DRUG SOLDIER అని ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ వద్ద ఫొటోస్ దిగిన విద్యార్థులు,యువత అధికారులు.
అనంతరం ర్యాలీ కి వచ్చిన విద్యార్థులతో..
"నేను మాదకద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీలక భాగ్యస్వామి అవుతానని, డ్రగ్స్ వాడటం వలన కలిగే దుష్పరిమానాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతోపాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మిన, కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని, డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామ్యం అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను."
గంజాయి లాంటి మత్తుపదార్థాలకు సంబందించిన సమాచారాన్ని తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో నెంబర్ 8712671111 కి లేదా డయల్100 లేదా మీ పరిధిలో ఉన్న పోలీస్ వారికి సమాచారం అందించాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుదన్నారు.
ఈకార్యక్రమంలో సి.ఐ లు మొగిలి, నాగేశ్వరరావు, నటేష్,మధుకర్, స్పెషల్ బ్రాంచ్ సి.ఐ రవి,ఆర్.ఐ లు మధుకర్, రమేష్, ఎస్.ఐ లు కిరణ్ కుమార్, రామ్మోహన్, శ్రీకాంత్, లక్ష్మణ్, శ్రీనివాస్, ఆర్.ఎస్.ఐ రాజు, పోలీస్ సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రజలు పాల్గొన్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు
Posted On 2025-12-07 19:45:50
Readmore >
చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి
Posted On 2025-12-07 18:39:01
Readmore >
పద్మశాలి విద్యార్థులు ఉన్నత విద్యలో ముందంజలో ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
Posted On 2025-12-07 17:30:34
Readmore >
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు
Posted On 2025-12-07 14:24:59
Readmore >
హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య
Posted On 2025-12-06 16:17:59
Readmore >
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు
Posted On 2025-12-06 16:16:40
Readmore >