| Daily భారత్
Logo




సన్ స్టీల్స్ లో దొంగతనం... 6 గంటలలో చేదించిన పోలీసులు

News

Posted on 2025-06-23 08:37:55

Share: Share


సన్ స్టీల్స్ లో దొంగతనం... 6 గంటలలో చేదించిన పోలీసులు

డైలీ భారత్, హైదరాబాద్: నోట్ల కట్టలతో పాన్ షాపుకు వెళ్ళడంతో ఓ కంపెనీలో జరిగిన చోరి కేసుకు ప్రధాన క్లూ అయ్యింది. ఆ క్లూతో పోలీసులు దర్యాప్తును ప్రారంభించి కేవలం ఆరు గంటల్లో దొంగను పట్టేశారు. చోరీ సొత్తు 46 లక్షలను రికవరీ చేశారు. ఆదివారం హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ నార్త్ జోన్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో డీసీపీ సాధన రష్మీ పెరుమాళ్ వెల్లడించారు. డీసీపీ రష్మిక పెరుమాళ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. బేగంపేట్ పోలీసు స్టేషన్ పరిధిలోని మినిస్టర్ రోడ్డు సన్ స్టీల్స్ లో చోరీ జరిగిందని పోలీసులకు శనివారం ఉదయం 11 గంటలకు ఫిర్యాదు అందింది.

రంగంలోకి దిగిన పోలీసులు ఆరు గంటల్లో ఆధారాలు సేకరించి సాయంత్రం 4 గంటల కల్లా నిందితుడు గిరిధార్ సింగ్ ను ఆదిలాబాద్- మహారాష్ట్ర సరిహద్దులో అదుపులోకి తీసుకున్నారు. ఈ చోరీకి పాల్పడింది ఇదే సన్ స్టీల్స్ లో పని చేసిన మాజీ ఉద్యోగి గిరిధార్ సింగ్ గా తేలింది. ఉద్యోగం లేకపోవడం, ఆర్ధిక కష్టాలు అధికమవడుంతో గతంలో ఈ కంపెనీ యజమాని తరుచుగా నగదును గోద్రేజ్ లాకర్ లో పెడతాడని తెలుసుకుని ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది.

ఆరు గంటల దర్యాప్తు ఇలా

బేగంపేట్ పోలీసులకు శనివారం సన్ స్టీల్స్ యజామని తన గోద్రేజ్ లాకర్ ను పగులగొట్టి 46 లక్షల నగదును ఎత్తుకెళ్ళారని శనివారం ఉదయం ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు స్పాట్ కు చేరుకుని దర్యాప్తును చేశారు. అయితే ఈ కంపెనీ సమీపంలో ఉన్న పాన్ షాపు నిర్వాహకుడు పోలీసులకు ఒక క్లూ ఇచ్చాడు. శుక్రవారం అర్ధరాత్రి సన్ స్టీల్స్ లో పనిచేసి మానేసిన గిరిధార్ సింగ్ ఉద్యోగి జేబులో డబ్బుల కట్టలు పెట్టుకుని రాత్రి గుట్కా కోసం వచ్చాడని చెప్పాడు. అలా పోలీసులకు లభించిన క్లూతో సీసీ కెమెరాలను జల్లెడ పట్టారు. ఇందులో ప్యారడైజ్ దగ్గర నిందితుడు గిరిధార్ సింగ్ బస్సు కోసం వేచి చూసి ఆ తర్వాత మేడ్చల్ వైపు ఆల్లలో వెళ్ళాడు.

ఆ రూట్ ను ఫాలో అయ్యి మేడ్చల్ లోని ఓ దాబా వద్దకు చేరుకున్నాడు. బస్సులన్ని వెళ్ళిపోవడంతో ఆ దాబాలో ఉండిపోయాడు. శనివారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ - గోరఖపుర్ వెళ్ళే ప్రైవేటు బస్సు ఎక్కినట్లు గుర్తించారు. బస్సు ఎక్కే సమయంలో దాబా నిర్వాహకుడి ఫోన్ నుంచి గిరిధార్ సింగ్ తాను ప్రస్తుతం పని చేస్తున్న కంపెనిలోని ఓ తోటి ఉద్యోగికి ఫోన్ చేసి జీతం విషయం మాట్లాడినట్లు పోలీసులు తెలుసుకున్నారు. అతను ఇచ్చిన సమాచారంతో గిరిధార్ సింగ్ మధ్యప్రదేశ్ లోని తన సొంత గ్రామానికి వెళ్తున్నట్లు తెలుసుకున్నారు.

అలా దాబా నుంచి బయలుదేరిన బస్సు నెంబరు, డ్రైవర్ నెంబరు తీసుకుని దాని రూట్ ను లొకేషన్ తెలుసుకుని అదిలాబాద్ పోలీసులను అప్రమత్తం చేసి అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఇలా లభించిన క్లూస్ తో పోలీసులు 46 లక్షల చోరీ కేసును చేధించి మొత్తం నగదును రికవరీ చేశారు. డబ్బులు పెట్టిన లాకర్ గది రేకులకు , ప్రహారీ గోడకు 3 అడుగుల గ్యాప్ ఉండడంతో అందులో నుంచి గిరిధార్ ప్రవేశించి లాకర్ ను పగులగొట్టి ఈ చోరీకి పాల్పడినట్లు విచారణలో బయటపడింది. ఈ కేసును వేగంగా చేధించిన పోలీసులను డీసీపీ సాధన రష్మీ పెరుమాళ్, అదనపు డీసీపీ అశోక్ కుమార్ లు పోలీసు సిబ్బంది, అధికారులను అభినందించారు

Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు

Posted On 2025-12-07 19:45:50

Readmore >
Image 1

చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి

Posted On 2025-12-07 18:39:01

Readmore >
Image 1

ఎస్ఎస్టీ చెక్ పోస్ట్ ను పరిశీలించిన ఇంచార్జి కలెక్టర్

Posted On 2025-12-07 18:35:52

Readmore >
Image 1

ఆయా దినపత్రికల స్టాపర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

Posted On 2025-12-07 17:31:39

Readmore >
Image 1

పద్మశాలి విద్యార్థులు ఉన్నత విద్యలో ముందంజలో ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

Posted On 2025-12-07 17:30:34

Readmore >
Image 1

కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు

Posted On 2025-12-07 14:24:59

Readmore >
Image 1

పర్యాటక రాష్ట్రం గోవాలో భారీ అగ్నిప్రమాదం

Posted On 2025-12-07 08:40:10

Readmore >
Image 1

టెన్త్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత

Posted On 2025-12-06 17:39:53

Readmore >
Image 1

హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య

Posted On 2025-12-06 16:17:59

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు

Posted On 2025-12-06 16:16:40

Readmore >