Posted on 2025-06-21 19:08:00
డైలీ భారత్, జగద్గిరిగుట్ట: హైదరాబాద్ నగరంలోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు బస్సు కింది పడి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జషిత్ చౌహాన్ (10) శుక్రవారం సాయంత్రం తన ఇంటికి సమీపంలో సైకిల్ తొక్కుతున్నాడు. ఆ క్రమంలో అనుకోకుండా కింద పడ్డాడు. అదే సమయానికి అటుగా ఓ స్కూల్ బస్సు వచ్చింది. అది మలుపు తిరిగే క్రమంలో ఆ బాలుడు బస్సు ముందు టైరు కింద పడటంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. గమనించిన కుటుంబసభ్యులు, వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డు కాగా, అవి ప్రస్తుతం వైరల్గా మారాయి.
బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-15 06:39:17
Readmore >
విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-14 22:44:54
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు
Posted On 2026-01-14 18:45:43
Readmore >