| Daily భారత్
Logo




డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడి జరిమానా భయంతో యువకుడి ఆత్మహత్య

News

Posted on 2025-06-21 14:26:59

Share: Share


డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడి జరిమానా భయంతో యువకుడి ఆత్మహత్య

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: మద్యం సేవించి వాహనం నడుపుతూ ఓ యువకుడు పోలీసులకు పట్టుబడ్డాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ నేరమని, కోర్టుకు హాజరై జరిమానా చెల్లించాలని పోలీసులు సూచించారు. దీంతో భయాందోళనకు గురైన యువకుడు ఇంటికి వెళ్లి ఉరివేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో శుక్రవారం చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా ముదిగొండకు చెందిన ఇరుకు గోపి(25) ఏడాది క్రితం ఖమ్మం ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భార్య కొత్తగూడెంలో నర్సింగ్‌ చదువుతుండడంతో పట్టణంలో అద్దె ఇంట్లో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల మద్యం తాగి బండి నడుపుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డాడు. ఈ నెల 19న పోలీసులు అతనికి ఫోన్‌ చేసి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసుకు సంబంధించి కోర్టుకు హాజరు కావాలని సూచించారు.

సమయానికి గోపి రాకపోవడంతో పోలీసులు మరోసారి ఫోన్ చేశారు. కోర్టుకు వచ్చి ఫైన్ కట్టకపోతే జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో భయాందోళనకు గురైన గోపి తన తండ్రికి ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. ఆ తరువాత భార్యను కళాశాల వద్ద దింపి ఇంటికి వచ్చి.. దూలానికి ఉరేసుకుని చనిపోయాడు. కాగా, తన భర్త మరణానికి ట్రాఫిక్ పోలీసులే కారణమని గోపి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Image 1

వలపు వల... దంపతుల ఎర

Posted On 2026-01-15 08:45:32

Readmore >
Image 1

బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త

Posted On 2026-01-15 06:39:17

Readmore >
Image 1

విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త

Posted On 2026-01-14 22:44:54

Readmore >
Image 1

జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు

Posted On 2026-01-14 18:45:43

Readmore >
Image 1

పోలింగ్ కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉండాలి

Posted On 2026-01-14 17:46:55

Readmore >
Image 1

ఐద్వా జాతీయ మహాసభలను జయప్రదం చేయండి

Posted On 2026-01-14 17:45:54

Readmore >
Image 1

సిపిఐ(ఎం) ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు

Posted On 2026-01-14 17:44:56

Readmore >
Image 1

వీబీ-జీ రామ్ జీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి

Posted On 2026-01-14 17:43:41

Readmore >
Image 1

గల్ఫ్ మృతదేహం తరలింపు... ఖర్చు భరించిన రాష్ట్ర ప్రభుత్వం

Posted On 2026-01-14 17:39:34

Readmore >
Image 1

బ్యాగ్‌ బరువు ఉండదక్కడ

Posted On 2026-01-14 15:26:21

Readmore >