Posted on 2025-06-19 14:36:18
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత రాహుల్ గాంధీ 54వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను పట్టణ కన్వీనర్ మొహమ్మద్ గౌస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ – "రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు నిరంతరం పోరాడుతున్న నాయకుడు. దేశంలో ఐక్యత, సామాజిక న్యాయం, యువత భవిష్యత్తు కోసం ఆయన చేస్తున్న కృషి ఆదర్శనీయమైనది. భారత్ జోడో యాత్ర ద్వారా ఆయన దేశ ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. త్వరలోనే కాంగ్రెస్ పునర్వైభవం సాధించి దేశానికి గౌరవం తీసుకొస్తుంది" అని అన్నారు. ఈ వేడుకల్లో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ దీర్ఘాయుష్కుడిగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు అల్లాడి నరసింహారావు, జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గడ్డం రాజశేఖర్, షేక్ నయీన్, మాజీ కౌన్సిలర్ ఎం.ఎ. రజాక్, మాజీ కౌన్సిలర్ కాసుల వెంకట్, మద శ్రీ రాములు, షేక్ అబ్దల్ సలాం, షేక్ నీసర్, మాజీ కౌన్సిలర్ తంగేళ్ళ లష్మణ్, మాజీ కౌన్సిలర్ పల్లపు లష్మణ్, మాజీ ఎంపీటీసీ భద్రం, దావుద్, ఉస్మన్, బాధవత్ కోటేష్, సంగు యాదాద్రి, తదితరులు పాల్గొన్నారు
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >