| Daily భారత్
Logo




ఆగినట్టే ఆగి ఊపందుకున్న జి ప్లస్ త్రీ నిర్మాణం

News

Posted on 2025-06-19 14:30:39

Share: Share


ఆగినట్టే ఆగి ఊపందుకున్న జి ప్లస్ త్రీ నిర్మాణం

నోటీసులు ఇచ్చిన ఆగని జి ప్లస్ త్రీ నిర్మాణలు

నోటీసులు అందజేస్తే నిర్మాణాలు ఆగిపోతాయా ? 

మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు అంటూ అక్రమ నిర్మాణాలు

జి ప్లస్ త్రీ అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్నది ఎవరు ?

గిరిజన చట్టాలను తుంగలో తొక్కుతూ అక్రమ నిర్మాణాలు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  కొత్తగూడెం నియోజకవర్గం లక్ష్మీదేవి పల్లి మండలంలో నేషనల్ హైవే రోడ్డు ప్రక్కన జి ప్లస్ త్రీ అక్రమ నిర్మాణాల జోరు నోటీసులు అందజేసినప్పటికీ  గిరిజన చట్టాలను తుంగలో తొక్కుతూ లక్ష్మీదేవి పల్లి పంచాయతీ పరిధిలో ప్రధాన రహదారి ప్రక్కన అక్రమ జి ప్లస్ త్రీ నిర్మాణాలు ఊపందుకున్నాయి. నెలరోజుల క్రితం పనులను నిలుపుదల చేసిన అధికారులు .. పట్టపగలే పైన కవర్లు తొలగించి నిర్మాణాలు చేస్తుంటే కంటపడకపోవడం ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది.నోటీసులు అందజేశాం అంటూ చేతులు దులుపుకుంటున్న పంచాయతీ అధికారులు. నోటీసులు అందజేస్తే నిర్మాణాలు ఆగిపోతాయా ? అక్రమ నిర్మాణం అని తెలిసి నోటీసులు అందజేసి చేతులు దులుపుకుంటే ఎలా వాటిని ఆపే అధికారం ఎవరికి లేదా ? అక్రమ నిర్మాణాలని ఆపాల్సిన అధికారులు వారికి అండగా నిలుస్తూ జి ప్లస్ త్రీ నిర్మాణం పూర్తయ్యే వరకు సహకరిస్తున్నారు. అనడంలో ఎటువంటి సందేహం లేదు. అన్నపురెడ్డిపల్లి చుంచుపల్లి మండల పరిధిలో  ఇంత పెద్ద అక్రమ నిర్మాణం జరుగుతున్న ఎంపీ ఓ కు కానీ పంచాయతీ కార్యదర్శి కానీ కనిపించ లేదంటారా లేదా ఇంకా ఏమైనా జరిగింటుందా అని చర్చించుకుంటున్న ప్రజలు. జి ప్లస్ త్రీ అక్రమ నిర్మాణానికి సహకరించుతున్న ఎంపీ ఓ పంచాయతీ కార్యదర్శిల పై చర్యలు తీసుకోవాలనీ కోరుతున్న ప్రజలు. అనుమాతులు లేకుండా నిర్మాణం మొదలుపెట్టిన మొదలుకొని జి ప్లస్ త్రీ నిర్మాణం పూర్తికావచ్చేవరకు అనగా కొన్ని నెలలుగా నిర్మాణం జరుగుతున్న అడ్డుకోకుండా నోటీసులు అందజేశాము అంటూ కాలయాపన చేస్తున్నారు తప్ప పనులు ఆపలేకపోతున్నా. పంచాయతీ మండల అధికారులు . ప్రధాన రహదారుల ప్రక్కనే జి ప్లస్ త్రీ నిర్మాణాలు కొనసాగుతున్న అధికారుల కంటపడకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది.మండల పంచాయతీ అధికారులు చేయవలసిన పనులు చేయకుండా జి ప్లస్ త్రీ అక్రమ నిర్మాణాలకు సహకరిస్తూ వారి నిర్మాణ పనులన్నీ పూర్తయ్యే విధంగా సహకరిస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహమే లేదు. దాదాపు నెల రోజులు కట్టడాలు నిలుపుదల చేసిన అధికారులు. మరి ఏమి జరిగిందో ఏమో ఇంతకుముందు నిర్మాణాలకు అడ్డుగా కవర్ కప్పి పనులు చేసిన వారు ఈరోజు పైన కవర్లు తొలగించి పనులు చేస్తున్నారంటే ఏమిటి. ఇప్పటికైనా అధికారులు స్పందించి జి ప్లస్ త్రీ నిర్మాణాలను నిలుపుదల చేయవలసిందిగా కోరుతున్న ప్రజలు.

Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >