Posted on 2025-06-17 18:49:36
డైలీ భారత్, వేములవాడ:రోడ్డు వెడల్పు పనుల తొలిదశలో భాగంగా.. స్థానిక పురపాలక సంఘానికి చెందిన మాంసం మార్కెట్ ప్రాంగణాన్ని జేసీబీ సహాయంతో కూల్చివేశారు. ప్రధాన రహదారి వెంట ఉన్న రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన వాణిజ్య సముదాయాన్ని కూల్చగా.. నాలుగు రోజుల్లోగా రహదారికి ఇరువైపులా సేకరించిన భవనాలను కూల్చివేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదనపు ఎస్పీ చంద్రయ్య ఆధ్వర్యంలో 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజన్న ఆలయం ముందు భాగం నుంచి మూలవాగు వంతెన వరకు 144 సెక్షన్ విధిస్తూ తహసీల్దార్ ఉత్తర్వులు జారీ చేశారు. పనులను కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, వేములవాడ ఆర్డీవో రాధాబాయి పర్యవేక్షించారు.
వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి, రోడ్ల వెడల్పును గత ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోలేదు. ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించి.. ఆ తర్వాత పట్టించుకోకుండా దేవుడినే మోసం చేశారు అని విమర్శించారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రోడ్డు వెడల్పు పనులు ప్రస్తుతం ప్రారంభమయ్యాయని.. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రోడ్డు వెడల్పులో ఇళ్లు కోల్పోతున్న వారికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇచ్చామని వివరించారు. ఈ ప్రాజెక్టు వేములవాడను మరింత అభివృద్ధి పథంలో నడిపించి.. భక్తులకు, స్థానికులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తుందని ఆశిస్తున్నారు.
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >
సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక
Posted On 2026-09-01 08:21:35
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపిఎస్
Posted On 2026-09-01 05:09:26
Readmore >
పసుపు, కుంకుమతో కోట్ల దోపిడీ... సిరిసిల్లలో దొంగ బాబాల అరెస్ట్
Posted On 2026-08-31 16:20:41
Readmore >