Posted on 2025-06-17 18:23:52
బతికిపోయా అంటున్న భర్త
డైలీ భారత్, ఉత్తరప్రదేశ్: ఎవరైనా పెళ్లి అయిన తర్వాత భార్య లవర్‌తో లేచిపోతే ఏం చేస్తారు. బాధతో ఏడుస్తారు. సిగ్గు, అవమానంతో ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉంటారు. కానీ ఆ వ్యక్తి మాత్రం తన భార్య.. ఆమె ప్రియుడితో పారిపోయిందన్న బాధ లేనే లేదు. పైగా హమ్మయ్యా బతికిపోయా అంటూ చెబుతున్నాడు. ఎందుకంటే.. త్వరలోనే తాము హనీమూన్ వెళ్లాలని అనుకున్నామని.. ఒకవేళ హనీమూన్ వెళ్తే రాజా రఘువంశీలా తాను కూడా హత్యకు గురయ్యేవాడిని అంటూ పేర్కొన్నాడు. ఇక రెండు కుటుంబాలు రాజీకి రావడంతో కథ సుఖాంతమైంది.
ఎన్నో ఆశలు, కోరికలు, ఫ్యూచర్ ప్లాన్లతో పెళ్లిళ్లు చేసుకుంటే.. పట్టుమని పది రోజులు కూడా ఆ పెళ్లిళ్లు నిలబడటం లేదు. పెళ్లికి ముందే తమకు ఇష్టం లేదని వెళ్లిపోకుండా.. పెళ్లి అయిన తర్వాత లవర్స్‌తో పారిపోవడం, అందుకు అడ్డుగా ఉన్న భర్తను చంపేయడం గత కొన్ని రోజులుగా బాగా ఫ్యాషన్ అయిపోయింది. ఇటీవల మేఘాలయ హనీమూన్ మర్డర్ దేశం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది. హనీమూన్‌కు అని చెప్పి.. అక్కడికి వెళ్లిన తర్వాత ప్రియుడితో కలిసి ప్లాన్ చేసి భర్తను చంపించి.. ఏమీ తెలియనట్లు భార్య చేసిన మాస్టర్ ప్లాన్ బయటికి రావడంతో దేశం మొత్తం ఆశ్చర్యంలో మునిగిపోయింది. ఇక తాజాగా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన యువతిని జార్ఖండ్‌కు చెందిన యువకుడికి ఇచ్చి పెళ్లి చేయగా.. సరిగ్గా 10 రోజులకే భర్తకు పురుగుల మందు ఇచ్చి చంపేసి పరారైంది. ఈ క్రమంలోనే తాజాగా ఇలాంటిదే మరో ఘటన వెలుగుచూసింది. అయితే ఇందులో ఆ భార్య.. భర్తను చంపకుండా వదిలేసి ప్రియుడితో పరారైంది. దీంతో తాను బతికి ఉన్నందుకు అదే 10 వేలు అనుకుంటూ ఆ భర్త సంతోషంగా ఉన్నాడు.
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >
సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక
Posted On 2026-09-01 08:21:35
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపిఎస్
Posted On 2026-09-01 05:09:26
Readmore >
పసుపు, కుంకుమతో కోట్ల దోపిడీ... సిరిసిల్లలో దొంగ బాబాల అరెస్ట్
Posted On 2026-08-31 16:20:41
Readmore >
భక్తి మన బలం... భద్రత మన బాధ్యత...ఒక్క విషాదం కూడా జరగకుండా గణేష్ ఉత్సవాలు జరుపుకుందాం : ఎస్పీ రాజేష్ చంద్ర
Posted On 2026-08-31 16:13:50
Readmore >
బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విముక్త జాతుల దినోత్సవం ఘనంగా నిర్వహణ
Posted On 2026-08-31 16:06:18
Readmore >
కామారెడ్డి జిల్లా :ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి
Posted On 2026-08-31 14:42:24
Readmore >