Posted on 2025-06-14 06:54:57
డైలీ భారత్, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టకు భంగం కలిగించేలా అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.రేవంత్ రెడ్డిని కించపరిచేలా, ఆయన ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతో కేటీఆర్ ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ తన ఫిర్యాదులో ఆరోపించారు. కేటీఆర్ చేసిన నిరాధారమైన, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలతో కూడిన వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో విస్తృతంగా ప్రచారం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై మాజీ సీఎం కేసీఆర్‌ను విచారణ కమిషన్ ప్రశ్నిస్తున్న సున్నితమైన తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి, ప్రజా శాంతికి భంగం కలిగించే ప్రమాదం ఉందని ఫిర్యాదులో వివరించారు. ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా పలు సోషల్ మీడియా పోస్టులను కూడా ఆధారాలుగా సమర్పించారు.అందుకున్న ఫిర్యాదు, సాక్ష్యాధారాల ఆధారంగా పోలీసులు కేటీఆర్‌పై భారతీయ న్యాయ సంహిత బీఎన్ఎస్లోని సెక్షన్ 353(2) ప్రజా శాంతికి భంగం కలిగించే ప్రకటనలు చేయడం, సెక్షన్ 352 శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఉద్దేశ్యంతో ఉద్దేశపూర్వకంగా అవమానించడం కింద కేసు నమోదు చేశారు.
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >
సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక
Posted On 2026-09-01 08:21:35
Readmore >