Posted on 2025-06-12 10:15:23
డైలీ భారత్, బీహార్: : నిర్లక్ష్యంగా, అతి వేగంగా కారు నడిపిన ఓ డ్రైవర్ ఓ ప్రాణం పోవడానికి కారణం అయ్యాడు. బిహార్ రాజధాని పట్నాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ కానిస్టేబుల్ మృతి చెందారు. శ్రీకృష్ణపురి ప్రాంతం సమీపంలోని అటల్ పాత్‌పై ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అటల్ పాత్‌పై వెళ్తున్న వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్, ఓ మహిళ కానిస్టేబుల్‌తో కూడిన బృందం ఒక కారును తనిఖీ చేస్తుండగా.. అతి వేగంగా వచ్చిన స్కార్పియో కారు.. పోలీసులు తనిఖీ చేస్తున్న వాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు పోలీసు సిబ్బంది గాయపడ్డారు.
గాయపడిన సిబ్బందిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మహిళ కానిస్టేబుల్ మృతి చెందారు. మిగిత ఇద్దరి పరిస్థితి స్థిరంగా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ పరార్ అయ్యాడు. వాహనంలో ఉన్న మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >