| Daily భారత్
Logo




హత్యకు దారి తీసిన ట్రైయాంగిల్ లవ్ స్టోరీ

News

Posted on 2025-06-12 09:42:30

Share: Share


హత్యకు దారి తీసిన ట్రైయాంగిల్ లవ్ స్టోరీ

డైలీ భారత్, త్రిపుర: అగర్తలోని ఇంద్రానగర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడి మిస్టరీ కసును పోలీసులు రోజుల వ్యవధిలోనే ఛేదించారు. త్రిపుర రాజధాని అగర్తలకు 120 కి.మీ దూరంలో ఉన్న ధలై జిల్లాలోని గండచ్చెరాలోని ఒక దుకాణంలో ఐస్ క్రీం ఫ్రీజర్‌లో ఓ ట్రాలీ బ్యాగ్‌లో అదృశ్యమైన యువకుడి మృతదేహం లభ్యమైంది. నిందితులు డాక్టర్ దిబాకర్ సాహా (28), అతని తండ్రి దీపక్ (52), తల్లి దేబికా (40), నబానితా దాస్ (25), జోయ్‌దీప్ దాస్ (20), అనిమేష్ యాదవ్ (21)గా పోలీసులు గుర్తించారు.

అగర్తల స్మార్ట్ సిటీ మిషన్ ప్రాజెక్ట్‌లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న అగర్తలకు చెందిన షరిఫుల్ ఇస్లాం (20) అనే యువకుడు జూన్‌ 8న అదృశ్యమయ్యాడు. దీంతో జూన్‌ 9న క్యాపిటల్ కాంప్లెక్స్ (ఎన్‌సిసి) పోలీస్ స్టేషన్‌ లో మిస్సింగ్ కేసు నమోదైంది. దిబాకర్ సాహా(28) అనే వైద్యుడు మరో మహిళ, షరిపుల్ మధ్య నడిచిన ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ ఈ హత్యకు దారి తీసినట్లు పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) కిరణ్ కుమార్ తెలిపారు. షరిపుల్ ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే ఆమెను సమీప బంధువైన దిబాకర్ సాహా కూడా ఆమెను ఇష్టపడుతున్నాడు. వీరిరువురి మధ్య నడచిన ఫోన్‌ సంభాషణలను పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో దిబాకర్‌ ప్రియురాలిని దక్కించుకోవడానికి షరిపుల్‌ అడ్డు తొలగించాలని భావించాడు. ఇందుకోసం పక్కా స్కెచ్‌ వేశాడు.

ఇంద్రానగర్‌లోని జోయ్‌దీప్ ఇంట్లో కలుద్దామని షరిపుల్‌కు ఫోన్‌ చేశాడు. ఇంటికి వచ్చిన అతడిని సాహా జోయ్‌దీప్, నబనిత, అనిమేష్ గొంతు కోసి హత్య చేశారు. తర్వాత అతడి చేతులు కట్టి, మృతదేహాన్ని ట్రావెల్‌ బ్యాగ్‌లో ప్యాక్‌ చేసి దిబాకర్, అతని తల్లిదండ్రులు కలిసి గండచెర్రకు ఆ బ్యాగ్‌ను తీసుకెళ్లారు. అనంతరం ఆ సూట్‌కేస్‌ను అతని తండ్రి దుకాణంలోని ఐస్‌ క్రీం ఫ్రిజ్‌లో భద్రపరిచారు. ఈ కేసును పోలీసులు రోజుల వ్యవధిలోనే ఛేదించారు. దిబాకర్‌ తల్లిదండ్రులతో సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో మరో మహళ కూడా ఉంది. మంగళవారం రాత్రి ఆరుగురు నిందితులను అరెస్టు చేసి షిరిఫుల్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను గురువారం కోర్టు ముందు హాజరుపరచనున్నారు. ముగ్గురు మధ్య నడచిన ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు దారితీసినట్లు మొబైల్ సందేశాల ద్వారా పోలీసులు గుర్తించారు.

ప్రేమ వ్యవహారాలు, అసూయతో మానవులు కిరాతకంగా మారుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. కుటుంబ సభ్యులు కూడా హత్యలో భాగం కావడం, సంఘటనా తీవ్రతను మరింత పెంచుతోంది. ఐస్‌క్రీం ఫ్రీజర్‌లో మృతదేహం దాచిన తీరు దారుణమైన క్రిమినల్ మైండ్‌సెట్‌కు నిదర్శనం.ఈ సంఘటన త్రిపుర రాష్ట్రాన్ని మరియు దేశాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది. ప్రేమ విషయంలో తట్టుకోలేని అసూయ, హత్య వరకు తీసుకెళ్లిన ఈ ఘటన, సామాజిక విలువలు, సంబంధాల విలువపై ఆలోచింపజేస్తోంది.

Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >