Posted on 2025-06-11 06:44:26
డైలీ భారత్, హైదరాబాద్:ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ కల్పించాలని కోరిన హెచ్‌యూజే – టీడబ్య్యూజేఎఫ్ నేతలు సానుకూలంగా స్పందిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన హైదరాబాద్ డీఈవో రోహిణి
ఈ అవకాశాన్ని జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేసిన హెచ్‌యూజే – టీడబ్య్యూజేఎఫ్ నేతలు
తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులకు ఒక శుభవార్తను అందించింది. నగరాలు, పట్టణాల్లో విద్య వ్యాపారంగా మారిన ఈ తరుణంలో, సామాన్య, మధ్యతరగతి వర్గాలు కార్పొరేట్ విద్యాసంస్థల్లో తమ పిల్లలను చేర్పించలేని పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో, వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో 50 శాతం ఫీజు రాయితీని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారిణి రోహిణి ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో 50 శాతం వరకు రాయితీ కల్పించాలని డీఈవో ఆర్. రోహిణి యాజమాన్యాలకు సూచించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఆమె నిన్న విడుదల చేశారు.
ఈ అంశంపై హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ (హెచ్‌యూజే – టీడబ్ల్యూజేఎఫ్) అధ్యక్షుడు బి. అరుణ్ కుమార్, కార్యదర్శి బి. జగదీశ్వర్ చేసిన విజ్ఞప్తి మేరకు డీఈవో రోహిణి సానుకూలంగా స్పందిస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ ఈవోలు, డిప్యూటీ ఈఓఎస్ (ఎంఈవో)లు తగు చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు.
ఈ సందర్భంగా డీఈవో రోహిణికి హెచ్‌యూజే – టీడబ్ల్యూజేఎఫ్ నేతలు అరుణ్ కుమార్, జగదీశ్వర్‌లు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని హైదరాబాద్‌లోని జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >