| Daily భారత్
Logo




భార్య కాపురానికి రావడం లేదని భర్త సూసైడ్

News

Posted on 2025-06-09 06:58:57

Share: Share


భార్య కాపురానికి రావడం లేదని భర్త సూసైడ్

డైలీ భారత్, సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. భార్య కాపురానికి రావడంలేదని భర్త ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. కిరణ్‌కు 5ఏళ్ల క్రితం లవ్‌మ్యారేజ్ అయింది. ఈమధ్య ఇద్దరికీ మనస్పర్థాలు రావడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోవడంతో సూసైడ్ చేసుకున్నాడు.

ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకున్నారు. ప్రేమ వివాహానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు. హ్యాపీగా జీవిస్తున్నారనుకున్న దంపతుల మధ్యలోకి మనస్పర్థాలు వచ్చాయి. అవి కాస్త పెరగడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన భర్త ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో జరిగిన ఘటన సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

భార్య కాపురానికి రావడం లేదని

సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని నిర్మల్ నగర్ గ్రామానికి చెందిన కర్రె కిరణ్ (27)కు గత 5 ఏళ్ల క్రితం లవ్ మ్యారేజ్ జరిగింది. అప్పటి నుంచి జగదేవపూర్‌లోనే నివసిస్తున్నారు.  వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇలా భార్య, పిల్లలతో హ్యాపీగా జీవితాన్ని గడిపేశాడు. అయితే ఇటీవల కాలం నుంచి భార్య భర్తల మధ్య మనస్పర్థాలు తలెత్తాయి. 

దీంతో అవి కాస్త ఎక్కువ కావడంతో కిరణ్ భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆమె తిరిగి కాపురానికి రాకపోవడంతో కిరణ్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. దీంతో తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు అతడ్ని హాస్పిటల్‌కు తరలించారు. కానీ కిరణ్ అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా

Posted On 2026-09-03 09:21:29

Readmore >
Image 1

భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Posted On 2026-09-03 07:53:15

Readmore >
Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >