| Daily భారత్
Logo




కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్ల పదవులు ఇవ్వాలి : షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్"

News

Posted on 2025-06-05 13:46:01

Share: Share


కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్ల పదవులు ఇవ్వాలి : షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్"

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కు వినతిపత్రం సమర్పించిన ఎమ్మెల్యే

మాజీ ఎమ్మెల్యే సి.ప్రతాప్ రెడ్డి

ఆర్యవైశ్య నాయకులు అగిరు రవి కుమార్ గుప్తాలకు

తదితర ముఖ్య నేతలకు అవకాశం కల్పించాలని వినతి

షాద్‌నగర్ నియోజకవర్గంలో మరి కొంతమంది నేతల పేర్లు సిఫార్సు చేసిన ఎమ్మెల్యే

డైలీ భారత్, షాద్‌నగర్: షాద్‌నగర్ నియోజకవర్గం నుండి ముఖ్యమైన నాయకులను కార్పొరేషన్ చైర్మన్ మరియు రాష్ట్ర కార్పొరేషన్లలో డైరెక్టర్లుగా నియమించాలని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ అధిష్టానాన్ని అభ్యర్థించారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కు టిపిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో ఎమ్మెల్యే శంకర్ వినతి పత్రాన్ని సమర్పించారు. షాద్ నగర్ నియోజకవర్గంలో ఇలాంటి గ్రూపు రాజకీయాలు లేని పార్టీగా అందరూ కలిసి ఐకమత్యంగా గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో నాయకులు కార్యకర్తలు సమస్యగా పనిచేసి మెజార్టీ సాధించారని ఆమె దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణ రాష్ట్రంలోని ఏదైనా కార్పొరేషన్‌లో చైర్మన్ పదవికి తాము సూచించిన నాయకులకు నియామకం కోసం వినతి పత్రం ద్వారా అధిష్టానానికి సూచించారు. ఇందులో ముఖ్యంగా కార్పొరేషన్ చైర్మన్ పదవుల జాబితాలో స్థానిక మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, కొత్తూరు మాజీ జెడ్పిటిసి సీనియర్ నేత మామిడి శ్యామ్ సుందర్ రెడ్డి, ఆర్యవైశ్య నాయకులు అగిరు రవి కుమార్ గుప్తాలకు సామాజిక న్యాయం ప్రకారం కార్పొరేషన్ పదవులు కేటాయించాలని మీనాక్షి నటరాజన్ కు తెలియజేశారు. అదేవిధంగా తన నియోజకవర్గం నుండి మరికొందరు అంకితభావంతో ఉన్న నాయకులను వివిధ రాష్ట్ర కార్పొరేషన్లలో డైరెక్టర్లుగా నియమించడం కోసం సదరు నాయకుల పేర్లను పరిశీలించాలని 

ఈ వినతి పత్రంలో పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ పట్ల అచంచలమైన విధేయతను ప్రదర్శించారనీ మరియు 2023 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారనీ సమాజానికి సేవ చేయడం పట్ల వారి అంకితభావం మరియు నిబద్ధత వారిని ఈ ముఖ్యమైన పదవులకు అర్హులైన అభ్యర్థులను చేస్తాయనీ వినతి పత్రంలో అధిష్టానానికి సూచించారు. నియోజకవర్గంలోని కేశంపేట మండలం కొత్తపేట గ్రామానికి చెందిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పట్టూరి జగదీశ్వర్ (బలిజ)

జానంపేట నాగమణి (ముధిరాజ్),

మహమ్మద్ ఇబ్రహీం,(మైనారిటీ)

రాయికంటికృష్ణా రెడ్డి (రెడ్డి)

జరుపుల నెహ్రూ నాయక్ (లంబాడా), బాదేపల్లి సిద్ధార్థ ఎస్సీ (మాదిగ), జిల్లెళ్ల రాం రెడ్డి (ఓసి) ల పేర్లను పరిశీలించాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అభ్యర్థించారు. టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సారాద్యంలో నియోజకవర్గంలో పార్టీ తిరుగులేని అభివృద్ధి సాధిస్తుందని రాష్ట్ర ప్రభుత్వానికి పార్టీకి ఒక మంచి పేరు తీసుకువస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము  సూచించిన విధంగా అధిష్టానం తగిన సామాజిక న్యాయం చేస్తుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు..

Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా

Posted On 2026-09-03 09:21:29

Readmore >
Image 1

భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Posted On 2026-09-03 07:53:15

Readmore >
Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >