| Daily భారత్
Logo




నేటితో ముగియనున్న సరస్వతి పుష్కరాలు

News

Posted on 2025-05-26 14:42:13

Share: Share


నేటితో ముగియనున్న సరస్వతి పుష్కరాలు

డైలీ భారత్, భూపాలపల్లి జిల్లా: భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఆధ్యాత్మికత తో శోభిల్లిన సరస్వతి పుష్కరాలు నేటితో ముగియనున్నాయి. త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నా నాల కోసం వేలాదిమంది భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుండి భక్తులు తరలివచ్చారు. 

భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి నదిమాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పలువురు దంపతులు కలిసి త్రిగుణాత్మక నదుల సాన్నిధ్యంలో స్నానం చేసి పుణ్యఫలాన్ని అందుకుం టున్నారు. తీరం వెంట సైకత లింగాలను ఏర్పాటు చేసి భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అలాగే, పితృదేవతలకు శ్రాద్ధకర్మలతో తీరాన్ని పరిపూర్ణంగా మార్చారు.

ఈ సాయంత్రం 7 గంటలకు త్రివేణి సంగమంలో సప్తహా రతులు జరగనున్నాయి. అలాగే పుష్కరాల ముగిం పు సందర్భంగా పూజారు లు చండీ హోమాన్ని నిర్వహించనున్నారు. చివరి రోజు కావడంతో అధికారు లు భారీగా భక్తుల రాకను ఊహించి ట్రాఫిక్‌ ఇబ్బందు లు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 

సాయంత్రం పుష్కర స్నానానికి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రానున్నారు. అనంతరం ముగింపు వేడుకల్లో పాల్గొని నవరత్నామాల హారతిని దర్శించనున్నారు.ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, నాగఫణి శర్మలు పాల్గొంటారు. 

పుణ్యస్నానం అనంతరం భక్తులు క్యూలైన్లలో బారులు తీరుతూ శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటున్నారు. సరస్వతీ మాత, శుభానం దదేవి అమ్మవారుల దర్శనార్థం లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఒకవైపు భక్తి భావన, మరో వైపు భక్తుల ఉత్సాహంతో కాళేశ్వరం పుష్కర క్షేత్రంగా ప్రకాశించింది.

Image 1

వలపు వల... దంపతుల ఎర

Posted On 2026-01-15 08:45:32

Readmore >
Image 1

బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త

Posted On 2026-01-15 06:39:17

Readmore >
Image 1

విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త

Posted On 2026-01-14 22:44:54

Readmore >
Image 1

జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు

Posted On 2026-01-14 18:45:43

Readmore >
Image 1

పోలింగ్ కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉండాలి

Posted On 2026-01-14 17:46:55

Readmore >
Image 1

ఐద్వా జాతీయ మహాసభలను జయప్రదం చేయండి

Posted On 2026-01-14 17:45:54

Readmore >
Image 1

సిపిఐ(ఎం) ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు

Posted On 2026-01-14 17:44:56

Readmore >
Image 1

వీబీ-జీ రామ్ జీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి

Posted On 2026-01-14 17:43:41

Readmore >
Image 1

గల్ఫ్ మృతదేహం తరలింపు... ఖర్చు భరించిన రాష్ట్ర ప్రభుత్వం

Posted On 2026-01-14 17:39:34

Readmore >
Image 1

బ్యాగ్‌ బరువు ఉండదక్కడ

Posted On 2026-01-14 15:26:21

Readmore >