| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కొచ్చి తీరంలో సముద్రంలో మునిగిపోతున్న ఓడ నుంచి 21 మందిని రక్షించిన భారత కోస్ట్ గార్డ్స్

కొచ్చి తీరంలో సముద్రంలో మునిగిపోతున్న ఓడ నుంచి 21 మందిని రక్షించిన భారత కోస్ట్ గార్డ్స్

డైలీ భారత్, కొచ్చి: కొచ్చి సమీపంలో సముద్రంలో మునిగిపోతున్న ఒక విదేశీ నౌక నుంచి 21 మందిని భారత కోస్ట్ గార్డ్స్ రక్షించారు. మిగిలిన వారిని రక్షించేందుకు భారత తీర రక్షక దళం సహాయక చర్యలు కొనసాగిస్తోంది. లిబియాకు చెందిన ఓడ శనివారం అకస్మాత్తుగా నీళ్లలో మునిగిపోయింది. లిబియా జెండాతో ఉన్న ఈ కంటైనర్ నౌక MSC ELSA 3, మే 23న విజింజం పోర్టు నుండి marine fuelతో బయలుదేరింది. మే 24న అది కొచ్చికి చేరుకోవాల్సి ఉంది.

రెస్క్యూ ఆపరేషన్‌లో భారత తీర రక్షక దళం

మేసర్స్ ఎంఎస్సీ షిప్ మేనేజ్‌మెంట్ మే 24న మధ్యాహ్నం 1:25 గంటల ప్రాంతంలో కేరళ లోని కొచ్చి నుంచి దాదాపు 38 నాటికల్ మైళ్ల దక్షిణ పశ్చిమంలో తీవ్రమైన అలలు వస్తున్నాయని భారత అధికారులకు సమాచారం అందింది. భారత తీర రక్షక దళం మునిగిపోతున్న నౌకపై విమానం ద్వారా సహాయక చర్యలు చేపట్టింది. నౌకలో ఉన్న 24 మంది సిబ్బందిలో 9 మంది లైఫ్ బోట్లలో ఉన్నారు. మిగిలిన 15 మందిని మొదటగా రక్షించారు. 21 మందిని భారత కోస్ట్ గార్డ్స్ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు..

భారత తీర రక్షక దళం నౌక నుంచి బయటకు వెళ్ళే మార్గాల దగ్గర అనేక లైఫ్ బోట్లను అందించి. డీజీ షిప్పింగ్ భారత తీర రక్షక దళంతో సమన్వయం చేసుకుని నౌక యజమానులు తమ నౌకకు తక్షణ సాయం అందించాలని కోరారు. దాంతో భారత కోస్ట్ గార్డ్స్ రంగంలోకి దిగి మునిగిపోతున్న ఓడలోని 21 మందిని కాపాడింది. దాంతో భారీ ప్రాణనష్టం తప్పిపోయింది.

Previous పశువుల అక్రమ రవాణాలను అరికట్టాలి : కొండా చరణ్ బీఎస్పీ చర్ల మండల అధ్యక్షులు
Next రేవంత్ – లౌక్యం తెలిసిన సీఎం !
ADVERTISEMENT