| Daily భారత్
Logo




పశువుల అక్రమ రవాణాలను అరికట్టాలి : కొండా చరణ్ బీఎస్పీ చర్ల మండల అధ్యక్షులు

News

Posted on 2025-05-25 13:33:15

Share: Share


పశువుల అక్రమ రవాణాలను అరికట్టాలి : కొండా చరణ్ బీఎస్పీ చర్ల మండల అధ్యక్షులు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాచర్ల మండలంలో ఆవుల అక్రమ రవాణా రోజుకి విపరీతంగా పెరిగిపోతుందనీ  తక్షణమే ఈ అక్రమ రవాణా నీ అధికారులు అరికట్టాలని బీఎస్పీ చర్ల మండల అధ్యక్షులు కొండా చరణ్ డిమాండ్ చేశారు నిబంధనలను తుంగలో తొక్కుతూ అధిక సంఖ్యలో ట్రాలీలలో లారీల్లో పశువులను అత్యంత దారుణంగా కుక్కి కుక్కి  మెడలు విరిచి కాళ్ళు కట్టేసి నీరు లేకుండా గడ్డి పెట్టకుండా అత్యంత హింసాత్మకంగా పశువుల రవాణా చర్ల మండల కేంద్రంగా కొనసాగుతుందనీ అతి పవిత్రంగా భావించే ఆవులు అక్రమ రవాణాకు గురి కావడం పట్ల చర్ల మండల హిందూ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తుందనీ అన్నారు రాత్రి పగలు తేడా లేకుండా ఆవుల అక్రమ రవాణా జరుగుతుంటే స్థానిక అధికారులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు సంత పాటదారుల కనుసన్నల్లోనే ఈ అక్రమ రవాణా కొనసాగుతున్నట్లు విస్తృతంగా ప్రజల్లో ప్రచారం జరుగుతుందనీ తెలిపారు అధికారులు ఈ విషయాన్ని ఎందుకు పట్టించుకోకాపోవడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు ఆవుల అక్రమ రవాణానీ అరికట్టాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ ఎటువంటి చర్యలు  తీసుకోవడం లేదని ఆరోపించారు చర్ల నుండి ములుగు వైపుగా హైదరాబాదుకు ఈ పశువులను  తరలిస్తున్నారని అన్నారు అధికారులు ఈ విషయాన్ని చూసి చూడనట్లు ఉండడంతో కొందరు అక్రమార్కులు ఎటువంటి భయం లేకుండా యథేచ్ఛగా మూగజీవాలను అక్రమ రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారనీ ఆరోపించారు కొన్నిసార్లు ప్రజలు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ చర్యలు శూన్యంగా ఉంటున్నాయని అన్నారు ఒక్కోసారి వార్తలు రాస్తున్న విలేకరులపై కూడా దాడులకు దిగుతున్నారని అన్నారు కేవలం ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే జరగవలసిన పశువుల సంత చర్ల లో నిరంతరం ప్రతి రాత్రి యథేచ్ఛగా కొనసాగుతుందనీ తెలిపారు పంచాయతీ చూపించిన పరిమితి ప్రదేశాల్లో కాకుండా మండలంలో ఇతర ప్రాంతాలలో కూడా ఆవులను అధిక సంఖ్యలో కట్టేస్తున్నారూ పశువుల క్రయవిక్రయాలపై కేంద్రం ఎన్నో నిబంధనలు విధించినప్పటికీ ఏమి కూడా పాటిస్తున్నట్టు కనిపించడం లేదు అంతేకాకుండా బహిరంగం ప్రదేశాల్లో కొన్నిచోట్ల ఆవులు ఎద్దులు గేదలు కళేబరాలను విక్రయాలు చేస్తున్నారని వాటిని హైదరాబాద్ తరలిస్తున్నారని తెలుస్తోందనీ అధికారులు తప్పనిసరిగా ఈ విషయంపై దృష్టి సారించాలని కోరారు  పశు రవాణా చట్టం 1978 ద్వారా పశువులను ఇతర ప్రాంతాలకు తరలించాలంటే మండల స్థాయి తీర్మానం చేయాల్సి ఉంటుందనీ ఒక ట్రాలీ అయితే రెండు పశువులు లేదా లారీ అయితే నాలుగు పశువులను మాత్రమే ఎక్కించాలనీ వాటికి నీరు ఉండాలి మేత తప్పకుండా ఉండాలనీ ప్రతి అరగంటకు ఒకసారి పశువులను వాహనం దింపి సేదతీరే విధంగా చర్యలు తీసుకోవాలనీ అన్నారు గర్భంతో ఉన్న పశువులను ఎట్టి పరిస్థితుల్లో తరలించకూడదనీ అలా కాదని రవాణా  చేస్తే ఆ వాహనాన్ని పోలీసులు సీజ్ చేయాలనీ తరలిస్తున్న వ్యక్తులపై  చట్టపరమైన చర్యలు తీసుకోవాలనీ అయితే ఇక్కడ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని జరుగుతున్న పరిణామాల దృష్ట్యా అర్థమవుతుంది అధికారుల నిర్లక్ష్యం కారణంగా చర్ల మండల కేంద్రం నుంచి భారీ ఎత్తున గోవులు చర్ల మండలం నుండి జిల్లాలకు రాష్ట్రాలకు తరలిస్తున్నారనీ వాపోయారు తక్షణమే ఈ అక్రమ రవాణాని ఉన్నతాధికారుల జోక్యం చేసుకొని నిలిపివేయాలని అక్రమ పశువుల రవణదారులపై కఠినమైన చర్యలు తీసుకొని మూగజీవాలను అక్రమ రవాణా దారుల నుంచి కాపాడాలని  డిమాండ్ చేశారు నేను ఎడల గోవుల రక్షణ కొరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు


Image 1

కెన్నెడీ పాఠశాలలో ఘనంగా ఫేర్వెల్ పార్టీ... అభినందించిన పలువురు

Posted On 2026-03-04 16:19:10

Readmore >
Image 1

38వ వార్డులో దొంగ ఓట్లపై విచారణ జరపాలి... రీపోలింగ్‌కు డిమాండ్

Posted On 2026-03-04 16:16:19

Readmore >
Image 1

రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. 3 నెలల బియ్యం ఒకేసారి పంపిణీ

Posted On 2026-03-04 15:50:03

Readmore >
Image 1

భాగ్యనగరంలో జోరుగా నకిలీ సరుకుల దందా

Posted On 2026-03-04 14:17:30

Readmore >
Image 1

ఉపాధిహామీ కూలీలకు అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్.. ఫాలో కాకుంటే డబ్బులు రావు

Posted On 2026-03-04 14:16:32

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల : తేనెటీగల దాడి.. 10 మందికి గాయాలు

Posted On 2026-03-04 11:59:44

Readmore >
Image 1

నిర్మల్ : కారు బావిలో పడి యువకుడి దుర్మరణం

Posted On 2026-03-04 08:42:33

Readmore >
Image 1

సూర్యాపేట పట్టణ మెయిన్ రోడ్డు పై ఆక్రమణ తొలగింపు

Posted On 2026-03-04 08:10:27

Readmore >
Image 1

రెండు స్పా సెంటర్లపై దాడులు... 20 మంది అరెస్ట్

Posted On 2026-03-04 06:46:33

Readmore >
Image 1

ప్రతిష్టాత్మక లారెస్ వరల్డ్ టీమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు భారత మహిళా క్రికెట్ జట్టు ఎంపిక

Posted On 2026-03-04 06:20:57

Readmore >