Posted on 2025-05-24 18:01:26
డైలీ భారత్, మహబూబాబాద్: ఈ నెల 25 ఆదివారం జరగబోయే గ్రామ పాలన అధికారుల రాత పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
శనివారం జిల్లా కలెక్టర్ మహబూబాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగే జి.పి.ఓ పరిక్ష ఏర్పాట్లను రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.వీరబ్రహ్మ చారీ తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ....
పరీక్షా కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష కేంద్రం దగ్గర లోని నోటీస్ బోర్డులో సీటింగ్ అమరికను పరిశీలించారు. ఈ సీటింగ్ అమరిక, తరగతి గదిలోని సీటింగ్ ఒకేలా ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కంప్యూటర్ గదిని పరిశీలించారు. ఎలక్ట్రిసిటీ, త్రాగునీరు, తదితర మౌళిక వసతులు ఏర్పాటు చేయాలన్నారు. నిర్వహణ పై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఎక్కడ కాపీయింగ్ కు ఆస్కారం లేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎలాంటి తప్పిదాలకు అవకాశం ఇవ్వకుండా చూడాలన్నారు. పక్కాగా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిపించాలన్నారు.
ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట డి.ఈ.ఓ డాక్టర్ ఏ.రవీందర్ రెడ్డి, స్థానిక ఎం.ఆర్.ఓ చంద్ర రాజేశ్వర్, పట్టణ సి.ఐ పి.దేవేందర్, సి.సెక్షన్ సూపరింటెండెంట్ వినోద్, ఈ.డి.యం ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-15 06:39:17
Readmore >
విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-14 22:44:54
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు
Posted On 2026-01-14 18:45:43
Readmore >