| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తెలంగాణ చరిత్రలో రికార్డు..

తెలంగాణ చరిత్రలో రికార్డు..

18,139 మెగావాట్ల అత్యధిక విద్యుత్ డిమాండ్

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలు మంగళవారం ఉదయం 11:01 గంటలకు నమోదైన 18,139 మెగావాట్ల అత్యధిక విద్యుత్ డిమాండ్‌ను ఎటువంటి అంతరాయం లేకుండా సమర్థవంతంగా నిర్వహించాయి. ఇది రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక గరిష్ట డిమాండ్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. నాణ్యతతో కూడిన విద్యుత్ సరఫరా చేసిన విద్యుత్తు రంగంలోని ఉన్నతాధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

Previous డిజిటల్ సెన్సస్ 2027 కోసం సన్నాహాలు సమీక్షించబడ్డాయి
Next జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిపై సస్పెన్షన్ వేటు
ADVERTISEMENT