| Daily భారత్
Logo




జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా హోలీ వేడుకలు

News

Posted on 2026-03-03 17:01:53

Share: Share


జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా హోలీ వేడుకలు

అధికారులు, సిబ్బందితో కలిసి ఆనందాన్ని పంచుకున్న జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర ఐపిఎస్

డైలీ భారత్, కామారెడ్డి: జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో హోలీ పండుగ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపిఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పోలీస్ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని, ఒకరికొకరు రంగులు పూసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నిరంతరం విధి నిర్వహణలో బిజీగా ఉండే సిబ్బందిలో నూతనోత్సాహాన్ని నింపేలా ఎస్పీ స్వయంగా వారితో కలిసి ఆనందాన్ని పంచుకోవడం ఈ వేడుకల్లో విశేషం.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా ప్రజలందరికీ, పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రంగుల పండుగ హోలీ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, ఐక్యత మరియు కొత్త వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. వృత్తిరీత్యా ఎంతో ఒత్తిడితో కూడిన విధులను నిర్వహించే పోలీసు కుటుంబంలో ఇటువంటి వేడుకలు సభ్యుల మధ్య స్నేహభావాన్ని, ఐక్యతను మరింత పటిష్టం చేస్తాయని ఆయన పేర్కొన్నారు.

ఈ వేడుకల్లో జిల్లా అదనపు ఎస్పీ కె. నరసింహ రెడ్డి, కామారెడ్డి ఏఎస్పీ బి. చైతన్య రెడ్డి ఐపిఎస్, పిసిఆర్ సిఐ నరేష్, కామారెడ్డి టౌన్ ఎస్.హెచ్.ఓ నరహరి, సదాశివ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. సంతోష్ కుమార్, ఎల్లారెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజారెడ్డి, ఆర్.ఐ లు నవీన్ కుమార్, కృష్ణ మరియు జిల్లాలోని ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగను ఘనంగా జరుపుకున్నారు.

Image 1

పెద్ద చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-08-05 17:08:38

Readmore >
Image 1

పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ

Posted On 2026-08-05 17:07:25

Readmore >
Image 1

ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్

Posted On 2026-08-05 14:58:50

Readmore >
Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >