Posted on 2025-05-21 17:29:16
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా : దేశానికి మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరువలేనివి అని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి అన్నారు.బుదవారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం హిమాయత్ నగర్ చౌరస్తా లో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగ చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్యతో కలిసి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి ఆయన ఘన
నివాళులర్పించారు.ఈ సందర్భంగా చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ ప్రయోజనాల కోసం రాజీవ్ గాంధీ చేసిన అద్భుతమైన పనిని ఎప్పటికీ మరచిపోలేము అని అన్నారు.40 సంవత్సరాల వయసులో, ఆయన భారత చరిత్రలో అతి పిన్న వయస్కుడైన ప్రధానమంత్రి అయ్యారు అని అన్నారు.21వ శతాబ్దపు సవాళ్లు మరియు అవకాశాలకు భారతదేశాన్ని సిద్ధం చేయడంలో ఆయన దార్శనికత మరియు సాహసోపేతమైన జోక్యాలు కీలక పాత్ర పోషించాయి అని అన్నారు.ఈ కార్యక్రమంలో టిపిసిసి మెంబర్ షాబాద్ దర్శన్, మొయినాబాద్ మాజీ జడ్పీటీసీ కాలే శ్రీకాంత్,మాజీ చైర్మన్ చంద్రారెడ్డి,జంగయ్య, రామ్ రెడ్డి, రాజు గౌడ్, మహేందర్ ముదిరాజ్, రాఘవరెడ్డి, ప్రవీణ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మరో నేత కార్మికుడి ఆత్మహత్య
Posted On 2025-06-22 07:22:22
Readmore >ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల నమోదు పెరగాలి : హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
Posted On 2025-06-22 05:24:12
Readmore >టీజేఎంయు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ కొప్పుల రమేష్ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా అధ్యక్షుడు కురుమేల్ల శంకర్
Posted On 2025-06-21 17:19:52
Readmore >