Posted on 2025-05-08 09:02:43
డైలీ భారత్, కరీంనగర్: ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఏడేళ్లు ప్రేమించిన అమ్మాయి తనను మోసం చేసి వేరే పెళ్లి చేసుకుందని.. సెల్ఫీ వీడియో తీసి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఏడేళ్లు ప్రేమించిన అమ్మాయి తనను మోసం చేసి వేరే పెళ్లి చేసుకుందని.. సెల్ఫీ వీడియో తీసి రైలు కింద పడి యువకుడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం లక్ష్మణపల్లి గ్రామానికి చెందిన దార ఎల్లేష్ అనే యువకుడితో ఏడేళ్ల నుండి ప్రేమ వ్యవహారం నడిపించింది వరలక్ష్మి అనే యువతి. అయితే ఇటీవల ఆ యువతి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో మనస్తాపం చెందిన ఎల్లేష్.. సెల్ఫీ వీడియో తీసుకోని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.తన ఫోన్ లో కాల్ రికార్డింగ్స్ అన్ని ఉన్నాయని.. యువతి వచ్చే వరకు తన శవాన్ని తీయవద్దని, యువతి కుటుంబంపై చర్యలు తీసుకోవాలని చనిపోయే ముందు తన తల్లిదండ్రులను కోరాడు ఎల్లేష్.
ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హైదరాబాద్ గణేశ్ నగర్ కు చెందిన వరలక్ష్మి అమ్మాయిని ఏడేళ్ళుగా ప్రేమించానని.. ఆమె పూర్తి అడ్రస్ కనుక్కోండి అంటూ తన తల్లిదండ్రులకు ఎల్లేష్ చెప్పాడు. తాను ఆత్మహత్య చేసుకోవడానికి వరలక్ష్మీతో పాటుగా ఆమె తల్లి కూడా కారణమని వారిని వదిలి పెట్టవద్దని కోరాడు. తాను జాబ్ చేయడం లేదని తనను కాదని మరో అబ్బాయికిచ్చి పెళ్లి చేశారని వాపోయాడు. వరలక్ష్మికి ఫోన్ కొనిచ్చానని.. ఓ సారి ప్రెగ్నెన్సీ అయితే తీయించానని ఇప్పుడు తనని కాదని వాళ్ల బావని పెళ్లిని చేసుకుందని ఎల్లేష్ చెప్పుకొచ్చాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు
డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు
Posted On 2025-12-07 19:45:50
Readmore >
చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి
Posted On 2025-12-07 18:39:01
Readmore >
పద్మశాలి విద్యార్థులు ఉన్నత విద్యలో ముందంజలో ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
Posted On 2025-12-07 17:30:34
Readmore >
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు
Posted On 2025-12-07 14:24:59
Readmore >
హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య
Posted On 2025-12-06 16:17:59
Readmore >
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు
Posted On 2025-12-06 16:16:40
Readmore >