Posted on 2025-04-29 09:04:40
డైలీ భారత్, హైదరాబాద్: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గుండ్ల పోచంపల్లి మున్సిపల్ పరిధిలో బాసరగాడిలో గల కేకేసీ ఎలక్ట్రికల్స్ అనే ఫ్యాన్ తయారీ పరిశ్రమలో ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది...
అగ్ని ప్రమాదం జరగడంతో స్థానికులు తీవ్ర భయాందో ళనలు చెందుతున్నారు. వెంటనే పోలీసులకు, ఫైర్ సిబ్బందికి స్థానికులు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి పోలీసులు ఫైర్ సిబ్బంది చేరుకున్నారు.
మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. భారీగా మంటలు వ్యాపించడంతో చుట్టూ పక్కల పొగలు అలుముకున్నాయి. పొగలు దట్టంగా వ్యాపించడంతో చుట్టుపక్కల స్థానికులు శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు.
స్థానికులను భద్రత పరంగా సంఘటన స్థలం నుంచి పోలీసులు దూరంగా పంపించి వేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియా ల్సి ఉంది. అసలు ఈ ప్రమాదం ఎలా చోటు చేసుకుందనే విషయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
అయితే వరుస అగ్ని ప్రమాదాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని, పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా ప్రభుత్వం కఠినమైన భద్రతా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
#మేడ్చల్ భారీ అగ్ని ప్రమాదం #medchal #fire accident
అర్హులైన ఒక్క ఓటరు ఓటు కూడా తొలగిపోకూడదు... తంగళ్లపల్లి గ్రామసభలో డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్
Posted On 2026-08-27 15:58:53
Readmore >
"ఫీజుల బకాయి... బీజేపీ లడాయి"... సిరిసిల్లలో BJYM భారీ ధర్నా, ప్రభుత్వానికి రాగుల రాజిరెడ్డి వార్నింగ్
Posted On 2026-08-27 15:50:17
Readmore >
నిషేధిత భూములంటు"సెక్షన్ 22(ఎ )"తో రేవంత్ సర్కార్ "రాక్షస క్రీడ"
Posted On 2026-08-27 07:58:21
Readmore >
గంజాయి కేసులో రికార్డుల ఫోర్జరీ.. ఎక్సైజ్ సీఐ, కానిస్టేబుల్ సస్పెండ్!
Posted On 2026-08-27 05:16:28
Readmore >
రాజంపేట సబ్ ఇన్స్పెక్టర్ సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
Posted On 2026-08-26 17:27:24
Readmore >
సిరిసిల్ల అయ్యప్ప ఆలయంలో కోటి కుంకుమార్చన వైభవం... 4వ రోజు 600 మంది మహిళలతో ఘనంగా
Posted On 2026-08-26 17:11:26
Readmore >
ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు
Posted On 2026-08-26 11:21:46
Readmore >