ఖమ్మం రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వద్దిరాజు రవిచంద్ర
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: ఈనెల 27న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ సభ సందర్భంగా, వైరా నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఖమ్మంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నేతృత్వం వహించిన రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర రాబోయే సభ విజయవంతం కావాలని పిలుపునిస్తూ, నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు యల్లంకి సత్యనారాయణ , పోట్ల శ్రీనివాసరావు, వైరా ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, బీఆర్ఎస్ పార్టీ జూలూరుపాడు మండల మాజీ అధ్యక్షులు చావా వెంకట రామారావు, ఏన్కూర్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు పొన్నం హరికృష్ణ, సొసైటీ డైరెక్టర్ చాపలమడుగు రామ్మూర్తి, దుద్దుకుడి కృష్ణ ప్రసాద్, సింగరేణి మండల మాజీ సొసైటీ వైస్ ఛైర్మెన్ దారవత్ మంగీలాల్, సింగరేణి మండల బీఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు జూపల్లి రాము, అజ్మీరా సుఖ్య ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.