| Daily భారత్
Logo




నకిలీ విత్తనాలు అమ్మితే పి‌.డి యాక్ట్ తప్పదు : కె. నరసింహ ఐ‌పి‌ఎస్, ఎస్పీ సూర్యాపేట జిల్లా

News

Posted on 2025-04-18 14:32:34

Share: Share


నకిలీ విత్తనాలు అమ్మితే పి‌.డి యాక్ట్ తప్పదు : కె. నరసింహ ఐ‌పి‌ఎస్, ఎస్పీ సూర్యాపేట జిల్లా

- విత్తనాల కొనుగోలు విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి.

- గుర్తింపు పొందిన కంపెనీ ప్యాకింగ్, లేబుల్ తనిఖీ చేసుకోవాలి.

- విడి విత్తనాలతో అధిక ప్రమాదం.

- గ్రామాల్లోకి వచ్చి విడి విత్తనాలు అమ్మే వ్యాపారులను, మద్యవర్తులను నమ్మవద్దు.

- గుర్తింపు పొందిన విత్తన దుకాణాలు, వ్యాపారుల నుండి విత్తనాల కొనుగోలు చేయడం మేలు.

- రైతులకు నాణ్యమైన వితానాలు అందించడం విత్తన సంస్తల, డీలర్ల బాద్యత.

డైలీ భారత్, సూర్యాపేట: నకిలీ విత్తనాలు సరఫరా జరిగి రైతులు నష్టపోక ముందే అధికారులు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలి, నకిలీ విత్తనాలు గుర్తించి సీజ్ చేయాలి, నకిలీ విత్తనాల వల్ల జిల్లాలో ఒక్క రైతు కూడా నష్టపోవద్దు అని జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్ ఒక ప్రకటనలో కోరారు, సంభందిత అధికారులు అందరూ సమన్వయంగా పని చేసి రైతులకు నకిలీ వితనాలు సరఫరా జరగకుండా చూడాలి అన్నారు. రాష్ట్రానికి, దేశానికి వ్యవసాయం ముఖ్యమైన ఆధారం అలాంటి వ్యవసాయం చేసే రైతులు ఆరుగాలం కష్టపడి నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత కూడా విత్తన సంస్థలు, డీలర్లు, వ్యాపారులపై పై ఉన్నది, విత్తన వ్యాపార డీలర్స్ బాధ్యతగా మంచి నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలి అన్నారు. రైతులకు, వ్యవసాయానికి నష్టం కలిగేలా నకిలీ విత్తనాలు అమ్మితే అలాంటి వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేస్తాము, PD యాక్ట్ తప్పదు, షీట్స్ నమోదు చేస్తాం అని హెచ్చరించారు.  సూర్యాపేట జిల్లా ఆంధ్రా ప్రాంతానికి ముఖ్య సరిహద్దుగా ఉన్నది ఇక్కడ నకిలీ విత్తనాలు ఎక్కువగా సరఫరా అయ్యే అవకాశం ఉన్నది, ముందస్తు తనిఖీలు, రైతులకు అవగాహన కల్పించడం, డీలర్స్ కు అవగాహన కల్పించడం, సరిహద్దు లలో పటిష్టమైన నిఘా తో నకిలీ విత్తనాలు నివారించాలి అని ఎస్పీ అన్నారు. రైతులతో సమావేశాలు నిర్వహించి చైతన్య పరచాలి, గతంలో నకిలీ విత్తనాల కేసుల్లో సంబంధం ఉన్నవారి పై నిఘా ఉంచాలి అని ఆదేశించారు. రైతులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి అని ఎస్పీ విజ్ఞప్తి చేసినారు నాణ్యమైన కంపెనీ విత్తనాలు ఎంచుకోవాలి, లేబుళ్లు, ప్యాకింగ్ లేని విత్తనాలు కొనుగోలు చేయవద్దు అని కోరినారు, తక్కువ ధరకు వస్తున్నాయని గ్రామాల్లోకి వచ్చే మద్యవర్తుల వద్ద విడి  విత్తనాలు కొనుగోలు చేయవద్దు, ప్రభుత్వ గుర్తింపు పొందిన డీలర్స్ నుండి విత్తనాలు కొనుగోలు చేస్తే మంచిది అన్నారు. ఇతర రాష్ట్రాల నుండి జిల్లాల లనుండి ఎక్కువ మొత్తంలో విత్తనాలు కొనుగోలు చేసే రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు తీసుకోవాలని కోరినారు. నకిలీ విత్తనాల గురించి, అనుమానిత బ్రోకర్లు, డీలర్ల గురించి పోలీసు వారికి, వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలి అని కోరినారు.

Image 1

ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు

Posted On 2026-05-31 18:45:35

Readmore >
Image 1

హెల్త్ కార్డుల కోసం జీతంలో కోత విధించడం సరికాదు

Posted On 2026-05-31 18:02:37

Readmore >
Image 1

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Posted On 2026-05-31 18:00:17

Readmore >
Image 1

ఏసీబీ వలకు చిక్కిన సర్వ శిక్ష అభియాన్ ఏఈ

Posted On 2026-05-31 14:02:34

Readmore >
Image 1

బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికయిన చంద్రంపేట విద్యార్థులు

Posted On 2026-05-31 13:53:49

Readmore >
Image 1

"క్షణిక ఆనందం - జీవితకాల నష్టం"

Posted On 2026-05-31 11:23:19

Readmore >
Image 1

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు

Posted On 2026-05-30 22:26:06

Readmore >
Image 1

మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-30 22:23:35

Readmore >
Image 1

అమ్మ చరణధూళి బిడ్డలం : మంజుల పత్తిపాటి

Posted On 2026-05-30 17:58:19

Readmore >
Image 1

నకిలీ విత్తనాలు ఇచ్చిన మొక్కజొన్న సీడ్ కంపెనీ పై చర్యలు తీసుకోవాలి...బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-05-30 17:55:56

Readmore >