డైలీ భారత్, మేడ్చల్:తన ఇద్దరు కొడుకులను దారుణంగా నరికి చంపింది ఓ కసాయి తల్లి. ఈ దారుణ సంఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది. జీడిమెట్లలో నివసిస్తున్న ఓ మహిళ.. ఏడు సంవత్సరాల లోపు వయసున్న తన ఇద్దరు కుమారులను కొడవలితో దారుణంగా నరికి చంపింది. అనంతరం భవనం పైనుంచి దూకి తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై ఆరా తీసిన పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
కుటుంబ కలహాలతో మానసికంగా చితికిపోయిన ఓ తల్లి, తన ఇద్దరు చిన్నారులను క్రూరంగా వేట కొడవలితో నరికి, చంపింది,అనంతరం తాను బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
ఈ దారుణ ఘటన లో మృతిచెందిన తల్లి తేజస్విని రెడ్డిగా, ఆమె కుమారులు హర్షిత్ రెడ్డి, (7), ఆశిష్ రెడ్డి (5) గా పోలీసులు వెల్లడించారు. తేజస్విని తన చిన్న కొడుకు ఆశిష్‌కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు, పోలీసులు రామ్రాజ్ అసుపత్రికి తరలించారు.
అయితే మార్గ మధ్యలోనే ఆశిష్ మృతి చెందాడు. అయితే.. హర్షిత్ రెడ్డి ఘటన స్థలంలోనే మృతి చెందాడు.తేజస్విని రెడ్డి, ఈ ఘటన కు ముందు ఆరుపేజీల సూసైడ్ నోట్ రాసి ఉంచింది. సూసైడ్ నోట్ లో ఆమె తన మనో వేదనను, కుటుంబపరమైన ఒత్తిడులను వివరించినట్టు సమాచారం.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించా రు. ఘటనాస్థలానికి బాలనగర్ డీసీపీ, జీడిమెట్ల సీఐలు చేరుకుని క్లూస్ టీమ్ తో పరిశీలనలు చేపట్టారు. ఈ సంఘటన గాజులరామారంలో తీవ్ర విషాదాన్ని నెలకొల్పింది.