Posted on 2025-04-17 11:48:51
బంగారం ₹98,000.. పసిడి సరికొత్త రికార్డ్!
డైలీ భారత్, హైదరాబాద్: అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది. అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రతరమవుతుండడంతో సురక్షిత పెట్టుబడిగా భావించి పసిడిపై పెట్టుబడులు మళ్లిస్తున్నారు. అంతర్జాతీయ ధరను అనుసరించి దేశీయంగానూ దీని ధరకు రెక్కలు వస్తున్నాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల మేలిమి పసిడి ఒక్క రోజులోనే రూ.1650 మేర పెరిగి రూ.98,100ను తాకింది. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన పసిడి సైతం రూ.1650 మేర పెరిగి రూ.97,650కు పెరిగింది.
నిన్ను సాయంత్రం 4.30 గంటల సమయానికి హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల పసిడి రూ.97,700కు చేరింది. అటు వెండి ధర సైతం కిలోకు ఒక్క రోజులో రూ.1900 మేర పెరిగి రూ.99,400కు చేరింది. బుధవారం కిలో వెండి రూ.97,500 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా చూసినప్పుడు ఇంట్రాడేలో గరిష్ఠంగా ఔన్సు 3,318 డాలర్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం 3,296 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
అమెరికా, చైనా మధ్య గత కొన్ని రోజులుగా సుంకాల విషయంలో ఘర్షణ నెలకొన్న సంగతి తెలిసిందే. పరస్పరం టారిఫ్‌లు విధించుకోవడంతో పాటు ఎగుమతుల విషయంలోనూ ఆంక్షలు విధించుకుంటున్నాయి. ఈ అనిశ్చితులు కొనసాగుతున్నంత వరకు బంగారానికి డిమాండ్ కొనసాగుతుందని అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు డాలర్ ఇండెక్స్ బలహీన పడడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించొచ్చన్న ముందస్తు అంచనాలు కూడా బంగారం ధర పెరగడానికి కారణమని పేర్కొంటున్నారు.
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్
Posted On 2026-05-31 19:22:44
Readmore >
ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు
Posted On 2026-05-31 18:45:35
Readmore >
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు
Posted On 2026-05-30 22:26:06
Readmore >