Posted on 2025-04-17 09:49:20
డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో రోజుకో కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. ఇటీవల రాష్ట్రంలో నడుస్తోన్న రాజకీయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జోరుగా నడుస్తుండగా.. కులగణన చేసి బీసీలకు న్యాయం చేస్తున్నామంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే, తప్పుల తడకతో జనాలను మోసం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తూ.. ప్రజల్లోకి దూసుకుపోతున్నారు.
ఈ నేపథ్యంలోనే.. బీజేపీ పార్టీ కూడా తమ గళాన్ని గట్టిగా వినిపిస్తూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఇటీవల.. ప్రధాని మోదీ కులానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తమదైన శైలిలో ఖండిస్తూ.. కమల దళం అందరి దృష్టిని తమవైపు తిప్పుకుంటోంది.
ఈ క్రమంలోనే.. తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడి నియమానికి ముహూర్తం ఖరారు అయింది, ఈనెల 20 తర్వాత బిజెపి జాతీయ అధ్యక్షుడుని ప్రకటించనున్నారు. ఈ క్రమంలోనే రెండు రోజుల్లో ఆరు రాష్ట్రాల అద్యక్షుల ను ప్రకటించే ఛాన్స్ ఉంది..
దీనికోసం బుధవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అమిత్ షా, రాజ్ నాథ్, నడ్డా, పాల్గొన్నారు.
తెలంగాణ ఏపీ, తో సహా యూపీ,మధ్యప్రదేశ్ ఉత్తరఖండ్, కర్ణాటక, పుదుచ్చేరి, అధ్యక్షులను త్వరలోనే ప్రకటించనున్నారు.
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్
Posted On 2026-05-31 19:22:44
Readmore >
ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు
Posted On 2026-05-31 18:45:35
Readmore >
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు
Posted On 2026-05-30 22:26:06
Readmore >