Posted on 2025-04-15 20:18:41
రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : యువజన కాంగ్రెస్ ను బలోపేతం చేయాలి అని రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి అన్నారు.రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన జిల్లా కార్యవర్గ సమావేశంలో రంగారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి,రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అందే మోహన్ తో కలిసి ముఖ్య అతిధులుగా ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 6 ఏజెండా అంశాల పైన జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా యువజన కాంగ్రెస్ యాక్టివిటీస్ ను ఎప్పటికప్పుడు విత్ ఐవైసి యాప్ లో పొందుపరుస్తూ, ప్రతి అసెంబ్లీలో మరియు మండలంలో ఇంచార్జి లను ఏర్పాటు చేయాలని కోరారు. యూత్ జోడో- బూత్ జోడో కార్యక్రమంతో ప్రజల్లోకి మరింత ముందుకు వెళ్లి సోషల్ మీడియా కమిటీలను ఏర్పాటు చేయాలని కోరారు.అదేవిధంగా రాష్ట్రంలో మహిళలకు రాజకీయంగా గుర్తింపునిస్తూ స్థానిక సంస్థ ఎన్నికల దృశ్య నిత్యం మహిళలతో సమావేశాలు నిర్వహించాలని కోరారు.భారత రాజ్యాంగ పరిరక్షణ కొరకు జై బాపు, జై భీమ్,జై సంవిధాన్ కార్యక్రమానికి ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు...రాష్ట్ర యువతకు పెద్దపీట వేస్తూ ప్రజా ప్రభుత్వం తలపెట్టిన రాజీవ్ యువ వికాస్ పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శిలు అందే శ్రీకాంత్, పిప్పల్ల శ్రీనాథ్, ప్రేమ్ కుమార్,కోట జగదీశ్వర్,యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్
Posted On 2026-05-31 19:22:44
Readmore >
ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు
Posted On 2026-05-31 18:45:35
Readmore >
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు
Posted On 2026-05-30 22:26:06
Readmore >