| Daily భారత్
Logo




చిత్తూరు జిల్లాలో పరువు హత్య?

News

Posted on 2025-04-14 18:09:40

Share: Share


చిత్తూరు జిల్లాలో పరువు హత్య?

డైలీ భారత్, చిత్తూరు: చిత్తూరులో వివాహిత అనుమానాస్పద మృతి చోటు చేసుకుంది. పరువు హత్య కోణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు. చిత్తూరుకు చెందిన యాస్మిన్ భాను 3 నెలల క్రితం పూతలపట్టు మండ లానికి చెందిన సాయి తేజ ను ప్రేమ పెళ్లి చేసుకుంది. 

యాస్మిన్ భాను, సాయితేజ్ గత ఫిబ్రవరి 9న నెల్లూరు లో పెళ్లి చేసుకున్నారు. అదే నెల 13న తిరుపతి రూరల్‌ పోలీసులను ప్రేమజంట ఆశ్రయించింది. ఇద్దరూ మేజర్లు కావడంతో యాస్మి న్‌ భాను తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. యువతిని సాయితేజ వెంట పంపించారు.

ఆదివారం తండ్రికి సీరియస్ గా ఉందని భాను పుట్టింటికి వచ్చింది. కూతుర్ని చూసి ఆవేశానికి గురైన షౌకత్ అలీ ఆమెను తన పరువు తీశావంటూ మందలించారు. అనంతరం అలీ ఇంటి నుంచి వెళ్లిపోయాడని అందుకే ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని యాస్మిన్ తల్లి స్టేట్మెంట్‌లో పేర్కొంది. 

యువతి మృతిపై భర్త అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. ఊరి వేసుకున్న ఆనవాలు ఇంట్లో లేవంటూ, పైగా ఆస్పత్రి వరకు గోప్యత పాటించారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

పైగా యాస్మిన్ తండ్రి, ఆమెను భర్త ఇంటి నుంచి పుట్టింటికి తీసుకెళ్లిన బంధువులు పరారీలో ఉన్నారు. పోలీసుల అదుపులో యాస్మిన్ తల్లి ఉంది. యాస్మిన్ తండ్రి, బంధువుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Image 1

ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పదు

Posted On 2026-05-31 19:27:27

Readmore >
Image 1

పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo

Posted On 2026-05-31 19:24:06

Readmore >
Image 1

జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్

Posted On 2026-05-31 19:22:44

Readmore >
Image 1

ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు

Posted On 2026-05-31 18:45:35

Readmore >
Image 1

హెల్త్ కార్డుల కోసం జీతంలో కోత విధించడం సరికాదు

Posted On 2026-05-31 18:02:37

Readmore >
Image 1

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Posted On 2026-05-31 18:00:17

Readmore >
Image 1

ఏసీబీ వలకు చిక్కిన సర్వ శిక్ష అభియాన్ ఏఈ

Posted On 2026-05-31 14:02:34

Readmore >
Image 1

బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికయిన చంద్రంపేట విద్యార్థులు

Posted On 2026-05-31 13:53:49

Readmore >
Image 1

"క్షణిక ఆనందం - జీవితకాల నష్టం"

Posted On 2026-05-31 11:23:19

Readmore >
Image 1

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు

Posted On 2026-05-30 22:26:06

Readmore >