| Daily భారత్
Logo




120 కేజీల గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న బూర్గంపాడు పోలీసులు

News

Posted on 2025-03-23 03:09:25

Share: Share


120 కేజీల గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న బూర్గంపాడు పోలీసులు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు పోలీస్ స్టేషన్ లో పాల్వంచ డి.ఎస్.పి సతీష్ విలేకరుల సమావేశం. డిఎస్పి సతీష్ మాట్లాడుతూ అక్రమంగా రవాణా చేస్తున్న గాంజాయిని బూర్గంపాడు ఎస్ఐ రాజేష్, పట్టుకున్నారు, కారులో తరలిస్తున్న గంజాయిని, ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగింది.అక్రమంగా గంజాయి రవాణా చేస్తూ దొరికిన వారి పేర్లు ::

1). వాంకుడోతు సాయి కుమార్ తండ్రి పేరు: బాబు (లేటు ), 30 సంవత్సరాలు, లంబాడ, కారు డ్రైవర్ కారు నెంబర్ TS08JQ 2960 R/o రాజీవ్ నగర్ కాలనీ సారపాక, బూర్గంపహాడ్ మండలం 2). ఎడముత్యం వంశీ @ బంటు తండ్రి పేరు: అశోక్, వయస్సు: 24 సం: రాలు, కులం, మాల వృత్తి: ITC క్యాసువల్, నివాసం: పొలిపాక గ్రామం, కూనవరం మండలం, ASR జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ పారిపోయిన ముద్దాయిలు :

1)Sk. మున్వర్ ,

2) రమేష్ @ రమ్మీ

3) కర్వాల సురేష్

4) జగదీశ్ @ జగ్గు తండా,

5) స్వరూప్

6)పడవ నడిపే ఎల్లాజి

7) వాంకుడోతు సురేష్ R/o లాలు, బొమ్మనపల్లి, టేకులపల్లి

మండలం ప్రస్తుత నివాసం సోలాపూర్.గంజాయిని అమ్మిన వ్యక్తి కలిమెల కు చెందిన భీమ.

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ గ్రామ శివారు సమ్మక్క సారక్క గద్దెల వద్ద ఎస్ ఐ ఇళ్లరాజేష్  సిబ్బందితో కలసి వాహన తనికీలు చేస్తుండగా ఒక తెల్లని బెలెనో కారు లో గంజాయి తరలిస్తూ వాంకుడోతు సాయి కుమార్, పెడముత్యం వంశీ @ బంటు పట్టుపడినారు. గతంలో పలు గంజాయి కేసులలో ఉన్న 1)Sk. మున్వర్, 2) రమేష్ @ రమ్మి 3) కత్వాల సురేష్ 4) జగదీశ్ @ జగ్గు, 5. వాంకుడోతు సాయి కుమార్ లు కలసి మల్ల గంజాయి వ్యాపారం చెయ్యాలి అనుకోని సోలాపూర్ కు చెందినా వాంకుడోతు సాయి కుమార్ బాబాయ్ అయిన వాంకుడోతు సురేష్ తో గంజాయిని ఇల్లందు క్రాస్ రోడ్ దగ్గర ఇచ్చు విధంగా ఒప్పందం కుదుర్చుకుని ముద్దాయిలు 1)Sk. మున్వర్, 2) రమేష్ @ రమ్మీ 3) కత్వాల సురేష్ 4) జగదీశ్ @ జగ్గు, 5. వాంకుడోతు సాయి కుమార్ కలసి భద్రాచలం లో కార్ ను అద్దెకు తెసుకొని పోలిపాక వెళ్లి అక్కడ గంజాయిని గోదావరి దాటిన్చుటకు స్వరూప్, పెడముత్యం వంశీ @ బంటు ల సహాయంతో పడవ నడిపే ఎలాజి తో ఒప్పందం కుదుర్చుకుని అక్కడ నుండి ముద్దాయి లు మోటుకు వెళ్ళి కలిమెల కు చెందిన భీమ వద్ద 55 ప్యాకెట్ ల మొత్తం బరువు 121.140 Kg ల గంజాయి కొని కారులో పోలిపాక వచ్చి సాయి కుమార్ వాళ్ళని అక్కడ దింపి కారులో వింబరం కు వచ్చి ఉండగా, మిగిల వాళ్ళు పడవలో ఎల్లాజి సహాయం తో గోదావరి దాటి వచ్చి అట్టి గంజాయిని కారులో పెట్టుకొని సాయికుమార్ మరియు వంశీ లు వస్తుండగా పట్టుబడినారు. ఇట్టి గంజాయి విలువ రు. 60,57,000/- ఉండును. బెలెనో కారు నెంబర్ TS08JQ2960 గ కలదు.

గంజాయి కేసులో ఉన్న మిగతా వారిని కూడా త్వరలోనే పట్టుకొని రిమాండ్ కి తరలిస్తామని పాల్వంచ డి ఎస్ పి సతీష్ మీడియా సమక్షంలో తెలిపారు. బూర్గంపాడు  ఎస్ఐ రాజేష్ టాస్క్ ఫోర్స్ అధికారులను పోలీస్ సిబ్బందిని డి.ఎస్.పి సతీష్ అభినందించారు.

ఈ విలేకరుల సమావేశంలో పాల్వంచ సీఐ సతీష్ బూర్గంపాడు ఎస్ఐ రాజేష్ టాస్క్ ఫోర్సు ఎస్ఐ ప్రవీణ్ ఎస్ఐ రామారావు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Image 1

వేసవి సెలవుల్లో టీచర్ల ప్రమోషన్స్‌, బదిలీల షెడ్యూల్‌ విడుదల చేయాలి : TPTF రాష్ట్ర అధ్యక్షులు చకినాల అనిల్ కుమార్

Posted On 2025-04-20 15:02:56

Readmore >
Image 1

తిరుమల రెండో ఘాట్ వద్ద కారులో చెలరేగిన మంటలు

Posted On 2025-04-20 08:49:03

Readmore >
Image 1

నార్నె భూముల స్వాధీనం - బాలుడి లేఖతో హైడ్రా యాక్షన్. జూ.ఎన్టీఆర్ మామకు షాక్

Posted On 2025-04-19 19:00:32

Readmore >
Image 1

తెలంగాణలో రాబోయే పది రోజులు మండే ఎండలు

Posted On 2025-04-19 18:24:52

Readmore >
Image 1

ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న వద్దిరాజు రవిచంద్ర

Posted On 2025-04-19 18:23:45

Readmore >
Image 1

బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలి విశ్వహిందూ పరిషత్ డిమాండ్

Posted On 2025-04-19 18:21:12

Readmore >
Image 1

జూలూరుపాడు ఇంచార్జ్ గ్రామపంచాయతీ సెక్రటరీ హరిబాబు సన్మానించిన మల్టీపర్పస్ వర్కర్స్ మండల నాయకులు

Posted On 2025-04-19 16:29:52

Readmore >
Image 1

ఘనంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జన్మదిన వేడుకలు

Posted On 2025-04-19 15:58:50

Readmore >
Image 1

ఢిల్లీలో కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం.. నలుగురి మృతి

Posted On 2025-04-19 07:22:41

Readmore >
Image 1

అమెరికాలో వీసా రద్దయిన విద్యార్థుల్లో 50% మంది భారతీయులే!

Posted On 2025-04-19 07:16:05

Readmore >