Posted on 2026-05-02 20:18:08
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించిన ప్రభుత్వ విప్.
డైలీ భారత్, వేములవాడ : మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలని అధికారులకు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించారు. శనివారం వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న మర్రిపల్లి ప్రాజెక్ట్‌ను రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల పురోగతిని సమీక్షించి, పనుల్లో వేగం కూడా పెంచాలని అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. నిర్దేశిత గడువులో పనులు పూర్తి చేసి రైతులకు త్వరితగతిన సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ద్వారా అందుతున్న నీటిని సమర్థవంతంగా వినియోగించుకునేలా అనుసంధాన ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడం జరుగుతోందన్నారు...
మర్రిపల్లి ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత కుడి, ఎడమ కాల్వల ద్వారా సుమారు 3,600 ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా మల్లారం, నాగయ్యపల్లి, పోచెట్టిపల్లి, కొనయపల్లి, కాశయ్యపల్లి, ఎదురు గట్ల, చెక్కపల్లి, అచ్చన్నపేట, వెంకటంపల్లి, బాలరాజపల్లి తదితర గ్రామాలకు ప్రత్యక్ష, పరోక్ష లాభాలు చేకూరుతాయని పేర్కొన్నారు. భూసేకరణకు సంబంధించిన రైతులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం నిధులు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి
వేములవాడ నియోజకవర్గ పరిధిలోని ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు విప్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రతి ఎకరానికి నీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. నంది మేడారం పంపుల ద్వారా నీటి సరఫరాను మరింత మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
కలికోట సూరమ్మ ప్రాజెక్ట్, లచ్చపేట రిజర్వాయర్, ఎర్రచెరువు, పటేల్ చెరువుల అభివృద్ధి పనులను కూడా వేగవంతం చేసి రైతులకు నీరు అందించే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మర్రిపల్లిలో రైతు వేదిక, గోదాముల నిర్మాణానికి భూమి కేటాయించి నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఈ పరిశీలనలో ఆర్డీఓ రాధాభాయ్, నీటి పారుదల శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
విశ్వహిందూ పరిషత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి గా కొమ్ము నరేష్
Posted On 2026-07-29 04:49:54
Readmore >
రక్షించాల్సిన ఖాకీనే కీచకుడిగా మారాడు... జూబ్లీహిల్స్ CI సస్పెండ్
Posted On 2026-07-29 04:48:42
Readmore >
కామారెడ్డి : కళ్యాణలక్ష్మి పథకంలో భారీ మోసం బట్టబయలు... ముగ్గురి అరెస్ట్
Posted On 2026-07-28 17:42:20
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 71 మందికి కోర్టు శిక్షలు – ₹81,500 జరిమానా విధింపు
Posted On 2026-07-28 17:30:20
Readmore >
మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఇబ్రహీం
Posted On 2026-07-28 17:21:37
Readmore >
భద్రాద్రి జిల్లాలో సైబర్ మోసం... రూ.3.20 లక్షలు హోల్డ్ చేసిన పోలీసులు
Posted On 2026-07-28 17:20:49
Readmore >